Telangana process
-
'తెలంగాణను అడ్డుకునే వ్యక్తులపై తిరుగుబాటు'
-
'తెలంగాణను అడ్డుకునే వ్యక్తులపై తిరుగుబాటు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును ఆపుదామనే ప్రయత్నంలోనే తన శాఖ మార్చారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. తెలంగాణను అడ్డుకునే వ్యవస్థలు, వ్యక్తులపై తిరుగుబాటు కొనసాగుతుందన్నారు. తాను పదవులు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నందునే మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు ఇదంతా చేశారన్నారు. ఇది మూమ్మాటికీ అధికార దుర్వినియోగమే అన్నారు. తన రాజీనామాతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ముందు తన రాజీనామా చాలా చిన్నదన్నారు. -
రండి.. బాబూ రండి.. ప్యాకేజీలిస్తాం
-
రండి.. బాబూ రండి.. ప్యాకేజీలిస్తాం
*కాంగ్రెస్ నేతలకు తెలుగుదేశం వల * వైఎస్సార్ సీపీలో ఖాళీ లేకపోవడంతో అయోమయంలో నేతలు * వారిని గుర్తించి పార్టీలో చేర్పించుకునే యత్నంలో చంద్రబాబు * ఇప్పటికే పలు దఫాలుగా ప్రయత్నాలు.. వెనుకాడుతున్న నేతలు * ఏదోరకంగా ఒత్తిడి తెచ్చేందుకు సన్నిహిత పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపిన టీడీపీ అధినేత.. కాంగ్రెస్‌లో ఉంటే * ఏ ఫలితమూ లేదంటూ ఆందోళన కలిగించే యత్నాలు * మీ పార్టీలోకి వస్తే ఒరిగేదేముందంటూ నిలదీస్తున్న నేతలు * తమవైపు వస్తే టికెట్‌తోపాటు గత, ప్రస్తుత ఎన్నికల ఖర్చు సహా భారీ ప్యాకేజీ ఇస్తామని ఊరింపు సాక్షి, హైదరాబాద్: అధికార పక్షంతో కలిసి పనిచేయడం, విభజన విషయంలో పార్టీ అనుసరించిన రెండు నాల్కల ధోరణి వంటి అనేక వైఫల్యాలతో చతికిలపడిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల మాయోపాయాలపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పార్టీలోకి ఏదోరకంగా ఇతర పార్టీల నేతలను లాగడం ద్వారా పార్టీ బలపడిందన్న భావన కల్పించవచ్చన్న అభిప్రాయంతో ఇప్పుడు చేరికల కోసం భారీ ప్యాకేజీలనే టీడీపీ ఆశచూపుతోంది. విభజన విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం సృష్టించిన గందరగోళంతో రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారగా, దానికి తోడుగా నిలిచిన టీడీపీ పరిస్థితీ అంతే దారుణంగా మారింది. దీంతో ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నేతలను చేర్పించుకోవడానికి గడిచిన ఆరు మాసాలుగా టీడీపీ అనేక ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేదు. విభజన, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల మధ్య రాష్ట్ర రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విభజన ప్రక్రియలో పార్టీ పరంగా స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడంతో ఆ పార్టీలపై మెజారిటీ ప్రజలనుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పార్టీల వైఖరిని నిరసిస్తూ ఆ రెండు పార్టీల నుంచి కొందరు నాయకులు ఇప్పటికే వైఎస్సార్సీపీ లో చేరిపోయారు. మరికొంత మంది నేతలు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఖాళీ లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరలేక ఊగిసలాటలో పడ్డారు. ఈ పరిస్థితులను గమనించి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను చేర్పించుకోవడానికి టీడీపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రంగంలోకి టీడీపీ పారిశ్రామికవేత్తలు ఖాళీ లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరలేకపోయిన నేతలతో టీడీపీ గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఒక కొలిక్కరాలేదు. దాంతో టీడీపీ అధినేతకు సన్నిహితులైన పలువురు పారిశ్రామిక వేత్తలను రంగంలోకి దింపారు. పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు బయటవారి ద్వారా పలువురు కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెంచారు. గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలతో, కొందరు మంత్రులతో సైతం సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అర్థంకాని గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కొందరు నేతలు ఊగిసలాటలో ఉండగా, రేపటి రోజున ఎన్నికల్లో దెబ్బతిన్నా వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న హామీ ఇస్తూ భారీ ప్యాకేజీలతో వారిని పార్టీలో చేర్పించుకోవడానికి రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టికెట్ ఇప్పుడే ఖాయం చేయడంతో పాటు గత ఎన్నికల్లో చేసిన ఖర్చుతో పాటు ప్రస్తుత ఎన్నికల్లో అయ్యే ఖర్చు మొత్తం భరించడమన్నది ప్యాకేజీలో ఒక భాగంగా చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడొకరికి ఈ ప్యాకేజీతో పాటు ఆ నేత కోరిన మరో నలుగురికి కూడా టికెట్ ఇస్తామన్న హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, ఆ పార్టీలో కొనసాగితే ఏమాత్రం భవిష్యత్తు లేదని సంప్రదింపుల సందర్భంగా అనేక అంశాలను చెబుతున్నారు. టీడీపీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదని, మీ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనమేముందని కోస్తా జిల్లాకు చెందిన ఒక నేత.. రాయబారానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడిని సూటిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఉంటే ఓటమి ఖాయమని, మా పార్టీలోకి వస్తే కొంత మిగులు ఉండే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో మరోసారి మాట్లాడుకుందామని ఆయన చెప్పి పంపినట్లు సమాచారం. వల విసురుతున్నది వీరికే గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత పీఆర్పీ, అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలతో చంద్రబాబు తరఫున వెళ్లిన నాయకులు పలువురు ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చారు. కొందరు నేతలు చంద్రబాబుతో నేరుగా మాట్లాడించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, తోట నరసింహంలతో పాటు ఎమ్మెల్యేలు పంతం మోహనగాంధీ (పెద్దాపురం), వంగా గీత (పిఠాపురం), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), బండారు సత్యానందరావు (కొత్తపేట), ఈలి నానీ (తాడేపల్లిగూడెం), పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు (నర్సాపురం), శిల్పా మోహనరెడ్డి (నంద్యాల), ఆదాల ప్రభాకరరెడ్డి (సర్వేపల్లి) లతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాడేపల్లిగూడెం నుంచి 2004-09 మధ్య కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించిన కొట్టు సత్యనారాయణతో కూడా మాట్లాడినట్టు సమాచారం. గతంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా, దాడి వీరభద్రరావు, తమ్మినేని సీతారాం తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. దాంతో ఆ జిల్లాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరితే ఆ మూడు జిల్లాలను పూర్తిగా అప్పగిస్తామని గంటా శ్రీనివాసరావు ముందు ప్రతిపాదన ఉంచినట్టు తెలిసింది. పార్టీలోని బంధువుల ద్వారా మరో మంత్రి తోట నరసింహంపైన కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జయదేవ్ తిరుపతి సీటును కాంగ్రెస్ తరఫున ఆశిస్తున్నారు. స్థానికంగా ఆ సీటుకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. టీడీపీ తరఫున గతంలో ప్రాతినిధ్యం వహించటంతో పాటు గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చదలవాడ కృష్ణమూర్తి.. ఈసారి పోటీ చేయటం తన వల్ల కాదని అధినేతకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే తనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇవ్వాల్సిందిగా కోరగా అంగీకరించిన చంద్రబాబు.. మంత్రి కుమారుడు జయదేవ్‌ను పార్టీలోకి తెచ్చే బాధ్యతను జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు అప్పగించినట్లు తెలిసింది. -
విభజన కిరణం!
* సీఎం డెరైక్షన్లోనే చురుగ్గా విభజన ఏర్పాట్లు * కిరణ్ సూచనలతో ఢిల్లీకి సీఎస్.. అక్కడ పలువురు కేంద్ర అధికారులతో భేటీ * సీఎస్ తిరిగొచ్చాక రాష్ట్రానికి కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందం రాక * కావాల్సిన సమాచారం అందిస్తూ పూర్తిగా సహకరిస్తున్న రాష్ట్ర సర్కారు * విభజన భేటీలకు రాష్ట్ర అధికారులు హాజరయ్యేలా ఆదేశాలు * ఇప్పటికే అఖిల భారత సర్వీసు, ఉద్యోగుల వివరాలు ఢిల్లీకి అందజేసిన సీఎస్ * విద్యుత్, విద్య, వైద్యం, ఆరోగ్య శాఖల సమాచారం.. ఆస్తులు, అప్పులు, ఆదాయ వివరాలు కూడా.. * విభజన వేగంగా చేయడానికి కేంద్రం హడావుడి * ఓ వైపు ఈ ఏర్పాట్లన్నీ చకచకా చేయిస్తూ.. మరో వైపు సమైక్యవాదినంటూ సీఎం డాంబికాలు * పైగా వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ దిన వేడుకలు జరుపుకొంటామో లేదోనంటూ నిట్టూర్పు సాక్షి, హైదరాబాద్: అంతా అనుకుంటున్నట్లే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన ప్లాన్ చకచకా అమలవుతోంది. సీఎం కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఒకపక్క సమైక్య వాదం వినిపిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మరో పక్క మాత్రం.. విభజనకు కావాల్సిన ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ప్రకటనలు చేస్తున్న ఆయన నేతృత్వంలోని ప్రభుత్వమే.. ఇటు రాష్ట్ర విభజనకు అవసరమైన సకల సమాచారాన్ని కేంద్రానికి చేరవేస్తుండడం గమనార్హం. అయితే ముఖ్యమంత్రి ఇప్పటికీ సమైక్య ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం చూసి.. విభజన ఏర్పాట్లు చూస్తున్న అధికారులు సైతం విస్తుపోతున్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో సైతం తాను గట్టి సమైక్యవాదినంటూ కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసి వారు కంగుతిన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకొంటామో లేదోనంటూ ఆయన నిట్టూర్చడం చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే విభజన నోట్.. వాస్తవానికి విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడానికి ముందే రాష్ట్రానికి సంబంధించిన సమాచారమంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి చేరింది. కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యవాదినంటూ ప్రకటనలు చేస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయమైన ‘సీ బ్లాక్’ సాధారణ పరిపాలన శాఖలో నోడల్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతకు ముందు ప్రణాళిక శాఖ నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు కేంద్ర హోంశాఖకు చేరాయి. సీడబ్ల్యూసీ తీర్మానం రోజున ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అవసరమైన సమాచారాన్ని మెయిల్ చేశారు. ఈ అధికారులు తరచూ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతూనే దిగ్విజయ్ కార్యాలయం అడిగిన ప్రతి సమాచారాన్ని అందచేశారు. అదే విషయాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వివరించారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందే అప్పటి డీజీపీ దినేష్‌రెడ్డిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పిలిచి రాష్ట్ర విభజనపై చర్చలు జరిపింది. సీఎస్ సహా పలువురు సీనియర్ అధికారులు అప్పటికే ఢిల్లీ వెళ్లి వారికి అవసరమైన సమాచారాన్ని అందజేశారు. తెలంగాణ విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడానికి రూపొందించిన నోట్ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో పాటు ఆ నోట్లో ఏయే అంశాలు ఉన్నాయన్నది సీఎంకు ముందే చేరవేశామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సీఎం ఓకే.. విభజన సమావేశాలకు అధికారుల హాజరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునకు సంబంధించి కేంద్ర హోం శాఖతో పాటు వివిధ శాఖలు అడుగుతున్న సమాచారాన్ని ఆగమేఘాల మీద ఢిల్లీకి పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎస్ సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందంలో ఎవరెవరు ఉండాలి? రాష్ట్రంలో ఎవరి నుంచి సలహాలు స్వీకరించాలి? వంటి అంశాలను చర్చించేందుకు ప్రధాన కార్యదర్శి మహంతిని గత వారం ఢిల్లీ పిలిపించారు. ఆ వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల అంశాలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహపత్రం రూపొందించడానికి రాష్ట్రానికి వచ్చి మూడు రోజుల పాటు ఉన్న కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందానికి సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు అన్ని విధాలుగా సహకరించారు. ఈ బృందం సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి నాయకత్వం వహిస్తున్న విజయ్‌కుమార్ కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమై చర్చించారు. ఉద్యోగులు, విద్యుత్ పంపిణీ వివరాలు ఇప్పటికే ఢిల్లీకి.. రాష్ట్రంలో అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గత నెల 30నే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి అందజేశారు. అధికారులు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించి అవలంబించాల్సిన విధానం గురించి కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారులు సీఎస్‌కు వివరించడంతో పాటు అధికారుల వివరాలు పంపించడానికి ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని అందజేశారు. ఆ పత్రం మేరకు వివరాలను త్వరగా పంపించాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ రంగం విభజనకు సంబంధించి ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా అంశాల విభజనపై కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహు సమావేశమై చర్చించారు. జిల్లాల వారీగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరా అంశాలతో పాటు బొగ్గు, గ్యాస్ వివరాలను కేంద్ర ఇంధన శాఖకు అందజేశారు. విద్యపై కేంద్రం భేటీకి రాష్ట్ర అధికారుల హాజరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఉన్నత విద్య, సెకండరీ విద్య అంశాల పంపిణీకి సంబంధించి కూడా శుక్రవారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, సెకండరీ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ హాజరయ్యారు. జిల్లాల వారీగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, విద్యార్థులు, అధ్యాపకుల సంఖ్యలను ఈ సందర్భంగా కేంద్రానికి అందజేశారు. కేంద్ర ప్రాయోజిత విద్యా సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో లేవనే వివరాలను కూడా అందజేశారు. అలాగే ఇప్పటికే రాష్ట్ర అప్పులు, ఆస్తులు, ఆదాయ వివరాలను కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కేంద్రానికి పంపించారు. ఈ-మెయిల్లో సమాచారం కోరుతున్న జలసంఘం జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల వివరాలను, నీటి కేటాయింపుల వివరాలను కూడా రాష్ట్ర అధికారులు కేంద్రానికి పంపించారు. జలవనరుల పంపిణీకి సబంధించిన విషయంలో కేంద్ర జల సంఘం కీలక పాత్ర వహిస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఏదైనా అంశంపై సమాచారం కావాలంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా ఆ సమాచారాన్ని పంపించాలని కోరుతున్నారు. కేంద్రం కోరిన సమాచారాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. అలాగే జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, సీట్ల వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వానికి చెందిన ప్రధాన ఆసుపత్రులు ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయనే వివరాలను కూడా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారుల తీరు చూస్తుంటే రాష్ట్ర విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సమాచారం కోసం ఫోన్లు చేస్తూ ఐదు నిమిషాల్లో ఈ-మెయిల్స్ పంపాలని కేంద్ర అధికారులు కోరుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం హడావుడి చూస్తుంటే ఈ నెలలోనే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చేలాగ ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నవంబర్ చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అసెంబ్లీ అభిప్రాయానికి పంపించాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. సమైక్య ముసుగులో రాజకీయాలు భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అడ్డుకొని అదుపులోకి తీసుకోవడంతోనే కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్య రాజకీయం బయటపడింది. సమైక్యవాదినని ప్రచారం చేసుకోవడమే తప్ప ఆచరణలో ఆయన దానిని అమలు చేయడం లేదని స్పష్టమైందని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి నిజంగా సమైక్యవాది అయితే నల్లగొండలో విజయమ్మ పర్యటనకు అవకాశం కల్పించేవారు. కానీ, ఆయనకు ఇష్టం లేకపోవడం వల్లే పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు’ అని రాయలసీమకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు మండిపడ్డారు. సచివాలయం సీ బ్లాక్ వద్ద విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విజయమ్మను అడ్డుకోవడంతోనే కిరణ్ సమైక్య ముసుగు తొలగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. -
టీ-ప్రక్రియ ముందుకు కదలట్లేదు: సుష్మ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టడం మాట అటుంచితే విభజన ప్రక్రియలో అడుగు కూడా ముందుకు పడటంంలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను పొడిగించినప్పటికీ తెలంగాణ బిల్లు పెట్టలేకపోయాయని కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుష్మ మాట్లాడారు. తెలంగాణ అంశంతోపాటు యూపీఏ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపడానికి ఈ సమావేశాలను ప్రతిపక్షం సద్వినియోగం చేసుకుందన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆమె పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఉంటే రాష్ట్రంలో అనిశ్చితి సమసిపోయేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రం వాస్తవ రూపం దాలిస్తే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఎన్డీఏ హాయంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఆందోళనలు జరగలేదన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల తొలిరోజే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, సీమాం ధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు సష్టించి కాంగ్రెస్ పాపం చేసిందని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. -
7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ: కోదండరాం
తెలంగాణ ప్రక్రియను కేంద్రం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో ముల్కీ అమరవీరుల శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. సిటీ కాలేజ్ నంచి ఇందిరా పార్కు వరకు శాంతి ర్యాలీ జరుపుతామని, తర్వాత ముగింపు సభ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిందని ఆయన అంతకుముందు స్పష్టం చేశారు. విభజన తర్వాత ఎదురయ్యే సమస్యలను ఇచ్చిపుచ్చుకునే రీతిలో సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు లేనిపోని అవాంతరాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. సీఎం కిరణ్ విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని చెప్పారు. -
తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదు: దిగ్విజయ్
-
తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదు: దిగ్విజయ్
తెలంగాణ ప్రక్రియను ఆపేది లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సందేహాలన్నీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఏకే ఆంటోనీతో సమావేశమయిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు ఇచ్చిన లేఖల ఆధారంగానే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు వస్తుందని తెలిపారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: మధుయాష్కీ
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ డిప్యూటీ చీఫ్ విప్ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన గురువారమిక్కడ తెలిపారు. హోంమంత్రి అనారోగ్యం కారణంగానే కొంత ఆలస్యం జరిగిందని మధుయాష్కీ అన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులు అనవసర భయాలు, అపోహలు సృష్టించుకోవద్దని ఆయన సూచించారు. కాగా ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చకు రావటం లేదని సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అనారోగ్యం కారణంగా ఈ అంశం చర్చించటం లేదని తెలుస్తోంది.