టీ-ప్రక్రియ ముందుకు కదలట్లేదు: సుష్మ
Published Sun, Sep 8 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడం మాట అటుంచితే విభజన ప్రక్రియలో అడుగు కూడా ముందుకు పడటంంలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను పొడిగించినప్పటికీ తెలంగాణ బిల్లు పెట్టలేకపోయాయని కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుష్మ మాట్లాడారు.
తెలంగాణ అంశంతోపాటు యూపీఏ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపడానికి ఈ సమావేశాలను ప్రతిపక్షం సద్వినియోగం చేసుకుందన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆమె పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఉంటే రాష్ట్రంలో అనిశ్చితి సమసిపోయేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రం వాస్తవ రూపం దాలిస్తే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఎన్డీఏ హాయంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఆందోళనలు జరగలేదన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల తొలిరోజే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, సీమాం ధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు సష్టించి కాంగ్రెస్ పాపం చేసిందని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు.
Advertisement
Advertisement