'చేపల మార్కెట్లా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు' | Telangana Vijayotsava Sabha in warangal at 12th this month, says cpi narayana | Sakshi
Sakshi News home page

'చేపల మార్కెట్లా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు'

Published Sat, Mar 1 2014 11:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'చేపల మార్కెట్లా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు' - Sakshi

'చేపల మార్కెట్లా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు'

ఈ నెల 12న సీపీఐ అధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభను వరంగల్లో నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు  చింపిన విస్తరిలా చేసిందని ఆరోపించారు. సీఎం కిరణ్ నుంచి కేంద్ర మంత్రి పురందేశ్వరీ వరకు విభజన అనివార్యమని తెలిసిన ఎవ్వరు స్పందించ లేదన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహర శైలి రాష్ట్ర ప్రజలకు విసుగు పుట్టించిందని అన్నారు. 

 

రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు చేపల మార్కెట్ చందంలా తయారయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమే అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూటకో మాట మాట్లాడారని నారాయణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement