'నేపాల్ నుంచి తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలి' | Telugu tourists return from Nepal, says chandrababu naidu | Sakshi
Sakshi News home page

'నేపాల్ నుంచి తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలి'

Published Sun, Apr 26 2015 10:04 PM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM

'నేపాల్ నుంచి తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలి' - Sakshi

'నేపాల్ నుంచి తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలి'

సాక్షి,హైదరాబాద్‌ : నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యతలను చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. అలాగే నేపాల్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి తీసుకువచ్చిన తెలుగు యాత్రికులు, పర్యాటకులు వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయాణ ఏర్పాట్లను చూడాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావును కోరారు.

నేపాల్‌లో ఇంకా ఎవరైనా చిక్కుకుని వుంటే వారి వివరాలు సేకరించటానికి అక్కడి రాయబారి కార్యాలయంతో, విదేశాంత శాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని వారిని ఆదేశించారు. భూకంపం నేపథ్యంలో తీవ్ర భయాందోళనలకు గురైన తెలుగు యాత్రీకులకు ధైర్యం చెప్పాలని, వారి అండగా ఉండాలని చంద్రబాబు ఈ సందర్భంగా సుజనా చౌదరి, కంభంపాటిలను కోరారు. 

నేపాల్ నుంచి తీసుకొచ్చిన మరికొందరిని ఆదివారం రాత్రి విమానాల్లో వారి వారి స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. చంద్రబాబు నేపాల్‌లో తెలుగు రాష్ట్రాల యాత్రికుల స్థితిగతులను, యోగక్షేమాలను ఎప్పటికప్పడు తెలుసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement