రెండు రాష్ట్రాల్లో రుతురాగాలు | temperatures to come down in both states | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లో రుతురాగాలు

Published Fri, Jun 20 2014 12:53 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

temperatures to come down in both states

నేటి నుంచి తగ్గనున్న వేడిగాలులు, అధిక ఉష్ట్రోగ్రతలు


 సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం పూర్తిగా రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నంలోని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆ శాఖ నిపుణులు తెలిపారు. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో వర్షాలు వేగంగానే వస్తాయని వివరించారు. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ట్రోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని తెలిపారు. గురువారం వడదెబ్బకు గురై 79 మంది మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement