ఉద్రిక్తంగా అంగన్ వాడీ ర్యాలీ
విజయవాడ: విజయవాడలో శుక్రవారం అంగన్ వాడీ కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. క్యాంపు ఆఫీస్ ముట్టడించేందుకు అంగన్ వాడీలు ప్రయత్నించారు. దీంతో బందర్ రోడ్డులో పోలీసులు వారిని అడ్డుకోవడంతో.. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతమంది అంగన్ వాడీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు.