తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా చేసుకున్న అమ్మవారు, స్వామివార్లు కృష్ణానదిలో విహారానికి బయల్దేరారు.
తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా చేసుకున్న అమ్మవారు, స్వామివార్లు కృష్ణానదిలో విహారానికి బయల్దేరారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వైభవంగా మొదలైంది.
విద్యుద్దీపాలతో అలంకరించిన హంస వాహనం మీద స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలకంరించారు. అంతకుముందు విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఆలయం నుంచి కృష్ణానది వరకు ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను వాహనంలో ఉంచి కృష్ణానదిలో విహారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దపెట్టున జయజయధ్వానాలు చేశారు.