సాక్షి, విజయవాడ : వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు ఆదివారం నగరంలో ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్ష సజావుగా సాగింది. నగరంలో 115 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వీటిపై కలెక్టర్ ముందస్తుగానే సమీక్ష నిర్వహించి వివిధ విభాగాల అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించారు. పరీక్ష పత్రాల పంపిణీ మొదలుకుని జవాబు పత్రాలను ప్రత్యేక బందోబస్తు నడుమ హైదరాబాద్ పంపటం వరకు అన్ని విషయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో మొత్తం 64 వీఆర్వో పోస్టులకు గానూ 59,024 మంది, 403 వీఆర్‌ఏ పోస్టులకు గానూ 7,542 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన వారికి సైతం నగరంలోనే పరీక్ష సెంటర్లు కేటారుుంచారు. వీఆర్వో పరీక్షకు 52,119 మంది హాజరుకాగా, 6,905 మంది గైర్హాజరయ్యూరు. వీఆర్‌ఏ పరీక్షకు 6,684 మంది హాజరు కాగా, 908 మంది గైర్హాజరయ్యూరు. వీఆర్వోకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, వీఆర్‌కు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
పరీక్షా మెటీరియల్ పంపిణీ
ఆదివారం ఉదయం 5 గంటలకు అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.రఘునందనరావు పరీక్ష మెటీరియల్‌ను పరిశీలించి చీఫ్ సూపరింటెండెంట్లు, జోనల్, రూట్ ఆఫీసర్లకు అందజేశారు. వాటిని ప్రత్యేక వాహనాల్లో ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రాలకు తరలించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ జె.మురళీ, సబ్ కలెక్టర్లు దాసరి హరిచందన, చక్రధరరావు, డీఆర్వో ఎల్.విజయ్‌చందర్, జెడ్పీ సీఈవో సుబ్బారావు పరీక్షా మొటీరియల్ పంపిణీని, కేంద్రాలను సందర్శించారు.
కలెక్టర్ పరిశీలన
నగరంలోని బిషప్ హజరత్తయ్య ఉన్నత పాఠశాల, సిద్ధార్థ అకాడమీ, పీజీ సెంటర్‌లోని పరీక్షా కేంద్రాల్ని కలెక్టర్ రఘునందనరావు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా చిన్నపాటి ఇబ్బంది కూడ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జవాబు పత్రాల కవర్లకు అక్కడే సీల్‌వేసి పోలీసు భద్రత నడుమ అర్బన్ తహశీల్దార్ కార్యాలయూనికి చేర్చారని, అక్కడి నుంచి పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు, పోలీసు బందోబస్తు నడుమ హైదరాబాద్‌కు పంపామని చెప్పారు.
పరీక్ష.. ప్రశాంతం..
Published Mon, Feb 3 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement