నేడే పరీక్ష
గుంటూరులో 77 పరీక్ష కేంద్రాలు
హాజరుకానున్న 19,496 మంది అభ్యర్థులు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తు చేసిన 19, 496 మంది అభ్యర్థులకు గుంటూరు నగరంలో 77 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు తొమ్మిది కేంద్రాల్లో జరుగనుంది. 2,044 మంది హాజరుకానున్నారు.
మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ 77 కేంద్రాల్లో జరిగే పేపర్-2 పరీక్షకు 17,452 మంది హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని, నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు ప్రకటించారు. గతంలో పొందిన హాల్ టికెట్లతోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావచ్చునని, ఇప్పటికీ హాల్‌టికెట్లు పొందని వారు ్చఞ్ట్ఛ్ట.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.
టెట్‌ను పకడ్బంధీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరచనున్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెల్‌ఫోన్లు సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తెచ్చినా సంబంధిత అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.