ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్ | The arrest of a gang of pirates transformers | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్

Published Tue, Oct 14 2014 12:36 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్ - Sakshi

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్

ములకలచెరువు:
 ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 400 కిలోల రాగి తీగలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రామాంజీనాయక్, ఎస్‌ఐ నరేష్‌కుమార్ సోమవారం తెలిపారు. వారి కథనం మేరకు..సోమవారం తెల్లవారుజామున తంబళ్లపల్లె ఎస్‌ఐ నరేష్‌కుమార్, తన సిబ్బందితో కోసువారిపల్లె క్రాస్‌వద్ద వాహనాల తనిఖీలు చేశారు.

రెండు ఆటోలను తనిఖీ చేయగా వంద కిలోల రాగితీగలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లెకు చెందిన దనియాల పెద్దరమణ (43), సద్దాం(25), రమేష్(26) ఆటో డ్రై వర్లు మల్లేశ్వర్‌రావు(29), నాగరాజు (26)ను అరెస్ట్ చేశారు. వీరంతా ఆవుల శంకర్(30)నేతత్వంలో ఏడుగురి సభ్యులతో ఒక ముఠాగా ఏర్పడి ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది. అలాగే, కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని కొండలో నిందితులు దాచి ఉంచిన 300 కేజీల రాగితీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న ఆవుల శంకర్(30), మచ్చ రమేష్(25) కోసం గాలిస్తున్నామని, ఆవుల శంకర్, దనియాల పెద్దరమణపై అనంతపురం, వైఎస్‌ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఇంతకు ముందు దాదాపు 200 ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఇదలా ఉంచితే, వీరు జిల్లాలో వివిధ మండలాల్లో 82 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగితీగలను చోరీ చేసినట్టు తేలింది.

 రాగితీగలను కొన్న వారినీ అరెస్ట్ చేస్తాం
 ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా నుంచి రాగితీగలను కొన్న మదనపల్లెకు చెందిన నలుగురు గుజిరీ వ్యాపారులను కూడా అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. వీరు నిందితుల నుంచి కిలో రాగి తీగలు ’300 చొప్పున కొని బెంగళూరులో 1000  రూపాయల వంతున విక్రయిస్తున్నట్టు తేలిందని వెల్లడించారు. 82 ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి సంబంధించి ఇంకనూ 946 కేజీల రాగి తీగలను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐలు నరేష్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్‌ఐ నారాయణస్వామి, సిబ్బంది, శ్రీకాంత్, కుమార్, శిరాజ్, శంకర్, మారుతిరెడ్డి,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement