ప్రజల నెత్తిన మరో కరెంటు పిడుగు పడబోతోంది. ఇప్పటికే భరించలేని విద్యుత్ చార్జీలతో వినియోగదారులు బెంబేలెత్తుతుండగా మరోసారి భారం మోపేందుకు ఈఆర్‌సీ సిద్ధమవుతోంది. జిల్లా వినియోగదారులపై ఏకంగా రూ.161 కోట్ల భారం వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పేదలు, మధ్య తరగతి, వాణిజ్యం తేడా లేకుండా అందరిపైనా భారం మోపేందుకు నిర్ణయించారు. స్లాబ్‌ల మేర కాకుండా వినియోగించుకున్న విద్యుత్ మొత్తానికి ఒకే రేట్ వర్తింపజేయనుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడనుంది.
సాక్షి, కరీంనగర్ : విద్యుత్ చార్జీల పెంపునకు ఏపీఈఆర్‌సీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యుత్ చార్జీల రూపంలో జిల్లాలో ఏటా రూ.685 కోట్లు వసూలవుతుండగా... మరో 22 శాతం అధిక ఆదా యం సాధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన రూ.846 కోట్ల ఆదాయంగా టార్గెట్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. ఈ సారి మధ్య తరగతి ప్రజలనే టార్గెట్‌గా ఎంచుకున్నారు.
200 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే ఈ విభాగం వారికి ఇప్పటివరకు వివిధ స్లాబ్‌ల ప్రకారం చార్జీలను లెక్కించగా ఇప్పటినుంచి మొదటి యూనిట్ నుంచే రూ.6.32 చార్జీ వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఫలితంగా 200 యూనిట్ల వినియోగదారులు రెట్టింపు చార్జీలు కట్టాల్సిన పరిస్థితి రానుంది. ఇప్పుడున్న పద్ధతి ద్వారా 200 యూనిట్లకు రూ.664 బిల్లు వస్తుంటే కొత్త ప్రతిపాదన ప్రకారం వీరు రూ.1,264 చెల్లించా ల్సి ఉంటుంది. జిల్లాలో 2 లక్షల 84 వేల గృహ విద్యుత్ వినియోగ కనెక్షన్లు ఉండగా లక్షా 70 వేల కనెక్షన్లు 200, అంతకన్నా తక్కువ యూని ట్ల వినియోగం ఉన్నవే.
వీరి మీద వచ్చే ఏడాది ఏకంగా రూ.31 కోట్ల అదనపు భారం పడనుంది. నిరుపేదలను కూడా పెంపు నుం చి మినహాయించలేదు. 50 యూనిట్లలోపు వి ద్యుత్ వినియోగించే వారి మీద కూడా భారం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ స్లాబ్‌లో యూనిట్ ధర రూ.1.45 నుంచి రూ.3.10 పెంచుతూ ప్రతిపాదన చేశారు. 50 యూనిట్లు వినియోగించే పేదలు రూ.72కు బదులు రూ.155 చెల్లించాల్సి వస్తుంది.
వాణిజ్యానికీ తగలనున్న షాక్
గృహ విద్యుత్ వినియోగదారులపై భారం మోపేందుకు ప్రతిపాదించిన ఈఆర్‌సీ వాణి జ్య వినియోగదారులనూ వదలలేదు. వాణి జ్య కనెక్షన్ల చార్జీలను కూడా పెంచాలని ప్రతి పాదించారు. అన్ని స్లాబ్‌ల్లో యూనిట్ ధరను రూపాయి చొప్పన పెంచాలని నిర్ణయించారు. మధ్యతరహా పరిశ్రమల మీద యూనిట్‌కు అదనంగా రూ.3 వసూలు చేయాలని ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వీధి దీపాలు, తాగునీటి సరఫరాను కూడా అధికారులు వదిలిపెట్టలేదు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉచిత వి ద్యుత్ వర్తించని వ్యవసాయ కనెక్షన్లను మాత్ర మే చార్జీలపెంపు నుంచి మినహాయించారు.
నేడు ప్రజాభిప్రాయ సేకరణ
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ బహిరంగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. గురువారం కరీంనగర్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యుత్ వినియోగదారుల నుంచి బహిరంగ అభిప్రాయ సేకరణ జరుపనున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వినియోగదారులు, ప్రజాప్రతినిధు లు హాజరవుతారు. ఉదయం 10.30 నుం చి 5 వరకు అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఏపీఈఆర్‌సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు అశోకాచారి, రాజశేఖర్‌రెడ్డి, కార్యదర్శి మనోహర్‌చారి ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా పాల్గొంటారు.
భారం రూ.161 కోట్లు
Published Thu, Jan 23 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement