హైదరాబాద్: రాష్ట అధికార భాషా సంఘాన్ని త్వరలోనే ఏర్పాటుచేయనున్నామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం ఉన్నత విద్యామండలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార భాషాసంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఆయన నుంచి అనుమతి రాగానే ఛైర్మన్, సభ్యుల పేర్లను ప్రకటిస్తామన్నారు. వీటితో పాటు లలిత, సాహిత్య, నాటక అకాడెమీలకు కూడా త్వరలోనే కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు.
వక్ఫ్‌బోర్డు, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, క్రిస్టియన్ వెల్ఫేర్ కార్పొరేషన్ తదితర సంస్థలు పది, తొమ్మిదో షెడ్యూలలో ఉన్నాయని, వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇకనుంచి తెలుగు జాతి కీర్తిప్రతిష్టలు నిలబెట్టిన మహానుభావుల జన్మదినోత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నామని చెప్పారు.