మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: కృష్ణానది మిగులు జలాల పంపిణీపై శుక్రవారం బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఇ చ్చిన తుది తీర్పుతో జిల్లాలో ఎత్తిపోతల పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తీర్పుతో ఆయా నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కల్వకుర్తి (మహాత్మాగాంధీ) ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఏర్పడనుంది.
ఈ రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం దాదాపు రూ.4,418 కోట్లు వ్యయం చేసినా, మిగులు జలాలపై ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం, మనం లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే భవిష్యత్తులో కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలకు నీరు అందడం గగనమే. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కృష్ణానది మిగులు జలాల్లో కూడా రాష్ట్రానికి 200 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునేలా నిబంధనలు విధించడంతో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
50 టీఎంసీల నిర్ణయంతో జిల్లాలో నెట్టంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి కేటాయించిన 200 టీఎంసీల మిగులు జలాల్లో ఈ రెండు పథకాలకు 50 టీఎంసీల నీటిని ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదు.దీంతో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినా భవిష్యత్తులో 5.40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడం కష్టమే. కృష్ణా నికర జలాల కింద నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే కొత్తగా నిర్మించిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు నీటిని నింపే అవకాశం ఉంది. లేని పక్షంలో వర్షాకాలంలో కేవలం ఓవర్ ఫ్లో నీటిపైనే ఆధారపడాల్సిన దుస్ధితి నెలకొంది.
3.40 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, తదితర నియోజకవర్గాల రైతులు ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మరోవైపు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్టెంపాడు భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికింద గుడ్డెం దొడ్డి, ర్యాలంపాడు, సంగాల, తాటికుంట, నాగర్‌దొడ్డి, ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లిలో రిజర్వాయర్లు నిర్మించారు. దాదాపు నిర్మాణపనులు పూర్తికావస్తున్న తరుణంలో రైతాంగానికి ట్రిబ్యునల్ షాకిచ్చింది.
ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఊరట...
ఆర్డీఎస్ కింద ఇప్పటి వరకు 15.84 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, అదనంగా మరో 4 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా,ఇప్పటివరకు అం దులో సగం ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఆర్డీఎస్‌ను మున్ముందు బ్యారేజీగా మార్పు చేస్తే అదనంగా కేటాయించిన నీటి వల్ల పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే అవకాశం ఉం ది. ఇదొక్కటే జిల్లా రైతులకు ఊరట.
ఏపీ అభ్యంతరాలను పట్టించుకోని ట్రిబ్యునల్
Published Sat, Nov 30 2013 3:39 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement