ఆర్థిక ఉగ్రవాదంపై పోరు మొదలైంది
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
తిరుపతి రూరల్: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక ఉగ్రవాదంపై ప్రధాని మోదీ పోరు ప్రారంభించారని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తిరుపతిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక అసమానతలను తొలగించి, అవినీతి రహిత ఆర్థిక, రాజకీయ వ్యవస్థను నిర్మించేందుకే ఇలాంటి విప్లవాత్మక చర్యకు ప్రధాని పూనుకున్నారని తెలిపారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత కశ్మీర్ ప్రశాంతంగా ఉండటమే ఈ విజయానికి నిదర్శనమన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి రప్పించే సత్తా మోదీకి మాత్రమే ఉందన్నారు. వేజ్‌బోర్డు పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియాను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.