పాపం ‘ఫ్రై డే’ చేపలు
విజయవాడ: ఎంకిపెళ్లి సుబ్చి చావుకొచ్చినట్లు.. కాలువ పనులు చేపల ఉసురు తీశాయి. ఈ పనులకు ఎండ తోడవడంతో వందలాది చేపలు విలవిలాడుతూ తేలిపోయాయి. విజయవాడ వన్‌టౌన్‌లోని రథం సెంటర్‌ను ఆనుకుని ఉన్న ఏలూరు కాలువ మరమ్మతు పనుల కోసం కెనాల్ గేట్లు మూసేశారు. ఔట్‌ఫ్లో నీటిని మోటార్ల ద్వారా తోడేశారు. దీనికి ఎండ తీవ్రత తోడవడంతో శుక్రవారం కాలువలో వందల చేపలు చనిపోయాయి. నీటిపైకి తేలి కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి.