మదిమదిలో.. నీవు పదిలం
Published Tue, Sep 3 2013 6:08 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
జీవన మలిపొద్దులో నా అన్నవారి ఆదరణకు నోచక.. జీవిక సాగే మార్గం కానరాని పండు ముదుసలులకు ఆ పెద్దాయన ఓ పెద్ద దిక్కయ్యారు. అర్ధాకలితో అలమటించే నిరుపేదకు ఆకలి తీర్చే దైవమయ్యారు. అనారోగ్యానికి గురై.. చికిత్స చేయించు‘కొనే’ స్తోమత లేని పేద కుటుంబానికి ‘ఆరోగ్యశ్రీ’ రూపంలో ఆసరా అయ్యారు. జనం ఆకలి తీర్చే అన్నదాతలు.. ప్రకృతి విపత్తులతో కష్టాల్లో చిక్కుకున్నప్పుడు వారిని ఆదుకొన్న ఆపన్నహస్తమయ్యారు. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరినీ ఆదుకొన్న ఆ దేవుడు.. ఈ లోకానికి దూరమై నాలుగేళ్లు గడిచాయి. ఇప్పటికీ ఆ జనహిత నేతపై ప్రజల్లో గూడు కట్టుకున్న అభిమానం పొంగి ప్రవహిస్తూనే ఉంది. ఆ పెద్దాయన.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు.. ప్రజలు ఆ మహనీయుని స్మృతిస్తూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగేళ్లు అయినా జిల్లాలో ఆయనపై ప్రజాభిమానం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఒకపక్క జిల్లా అంతటా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నా మరోపక్క వైఎస్ వర్థంతిని కూడా అదే స్థాయిలో జిల్లావ్యాప్తంగా నిర్వహించుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్‌లు, ప్రజలు ఎవరిమట్టుకు వారు వైఎస్ ఫొటోలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పెద్దాయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లావ్యాప్తంగా విస్తృతంగా సేవాకార్య క్రమా లు చేపట్టారు. వైఎస్ సంక్షేమ పథకాల ద్వారా లబ్థిపొందిన నిరుపేద కుటుంబాలు సైతం తమ ఇళ్లల్లో వైఎస్ చిత్రపటాల వద్ద నివాళులర్పించి మహానేతపై అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నారు.
అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో మహానేత విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఏరియా ఆస్పత్రి, కిమ్స్ ఆస్పత్రుల్లో పార్టీ మహిళా విభాగం రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, కోఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పార్టీ పట్టణ యువజన కన్వీనర్ గనిశెట్టి రమణ్‌లాల్ సహా 21 మంది రక్తదానం చేశారు. కామాక్షిపీఠంలో అనాథ చిన్నారులకు అన్నసమారాధన, ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పార్లమెంటరీ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. రాజమండ్రి మంగళవారపుపేటలోని గంటా గనిరాజు కల్యాణమంటపంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ తనయుడు వాసు సహా 110 మంది రక్తదానం చేశారు. నగర పార్టీ కార్యాలయంలో మహానేత చిత్రపటానికి, కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేసిన కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నేత టీకె విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. రాజమండ్రి యూత్ కన్వీనర్ గుర్రం గౌతమ్ ఆధ్వర్యంలో బైపాస్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 45వ డివిజన్‌లో పార్టీ నాయకుడు కర్రి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వస్త్రదానంలో పార్టీ యువనేత జక్కంపూడి రాజా, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ గెడ్డం రమణ పాల్గొన్నారు.
రాజానగరంలో వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యం లో క్షీరాభిషేకాలు చేసి వైఎస్సార్ ఆశయాలు సాధిస్తామంటూ కార్యకర్తలతో ప్రమాణం చేయించగా, బొమ్మూరులో కుష్టురోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. రాజ మండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేశారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్యశంఖారావయాత్రకు వెళ్లడంతో నగర కన్వీనర్ ఆర్‌విజేఆర్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన కాకినాడ జిల్లా పార్టీ జిల్లా కార్యాలయంలో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్‌లోని వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి అదే సెంటర్‌లో సుమారు 2,500 మంది పేదలకు ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఆర్‌విజేఆర్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కాకినాడ బోటుక్లబ్ సమీపాన ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పార్టీ పార్లమెంటరీ నాయకులు చలమలశెట్టి సునీల్ సహా 50 మంది రక్తదానం చేశారు. సునీల్, జడ్పీ మాజీ చైర్మన్, కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
వీవర్స్ సెల్ జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ పాల్గొన్నారు. సామర్లకోటలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, సుమారు 100 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు.
గొల్లలమామిడాడ, రామవరంలలో జరిగిన అన్నసమారాధనలకు పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకులు బొడ్డు వెంకటరమణచౌదరి, పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యం వహిం చారు. మండపేట గాంధీనగర్ ఎరుబోతు ఆనంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి ఆవిష్కరించగా, రాయవరంలో పార్టీ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదలకు అన్నసమారాధన చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అంధుల పాఠశాలలో విద్యార్థులకు, ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
రామచంద్రపురం మెయిన్‌రోడ్డులోని మహానేత వైఎస్ విగ్రహానికి పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఘనంగా నివాళులర్పించి, ఏరియాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కె.గంగవరం లో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పిఠాపురం లో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో మహానేత విగ్రహాలకు క్షీరాభిషేకం, గొల్లప్రోలులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.
ఉప్పాడ కొత్తపల్లిలో పార్టీ సీజీసీ సభ్యుడు గంపల వెంకట రమణ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఏలేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో వైఎస్‌కు నివాళులర్పించి 800 మందికి అన్నసమారాధన చేశారు. రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వందమంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రంపచోడవరంలో కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్, అరకు పార్లమెంట రీ పార్టీ నాయకురాలు కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి, ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 20 మంది రక్తదానం చేశారు. మారేడుమిల్లిలో చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తుని లో మహానేత విగ్రహాలకు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు, ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసిన కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ రొంగలి లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. శోభారాణి పాల్గొన్నారు.
రాజోలు ప్రభుత్వాస్పత్రిలో కో ఆర్డినేటర్ మట్టా శైలజ ఆధ్వర్యంలో పాలు పండ్లు పంపిణీ చేశారు. మరో కో ఆర్డినేటర్ చింతలపాడి వెంకటరామారాజు ఆధ్వర్యంలో మలికిపురంలో వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషే కాలు చేసి. విశ్వేశ్వరాయపురంలోని వృద్ధాశ్రమంలో పండ్లు, పాలు పంపిణీ చేశారు. ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, మాజీ ఎంపీపీ పెన్మత్స చిట్టిరాజు, భూపతిరాజు సుదర్శనబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేశారు. మామిడికుదురులో కో ఆర్డినేటర్లు విప్పర్తి వేణు గోపాల్, కొండేటి చిట్టిబాబు, మందపాటి కిరణ్‌కుమార్ వైఎస్సార్ ఆత్మకు శాంతి కలగాలంటూ శాంతి యాత్ర నిర్వహించారు. మామిడికుదురు బస్టాండ్ సెంటర్ నుంచి 216 జాతీయ రహదారి వరకు ఈ యాత్ర సాగింది. శివాలయాలు, విష్ణాలయాల్లో పూజలు చేశారు.
మామిడికుదురులో నిరుపేదలకు చీరలు, నాగుల్లంకలో వెయ్యి మందికి అన్నదానం చేశారు. మొగలి కుదురు సత్యసాయి కేంద్రంలో పార్టీ కార్యకర్త ఉప్పే వేణుగోపాల్ 20 మంది వృద్ధులకు రొట్టెలు, పండ్లతో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయా న్ని అందజేశారు. జగ్గంపేటలో సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ షర్మిల సమైక్యాశంఖారావయాత్రలో ఉండడంతో అతని తనయుడు జ్యోతుల నవీన్ వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి వృద్ధులు, రోగులు, చిన్నారులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వికలాంగుడు గొల్లపల్లి రత్నరాజు ఆధ్వర్యంలో జగ్గంపేటలో అన్నసమారాధన నిర్వహించారు. రాజమండ్రికి చెందిన వివేకానంద సేవాసమితి కన్వీనర్ సిగిరెడ్డి రమేష్ ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి 20 మంది అన్ని విభాగాలకు చెందిన వైద్యులను ప్రత్తిపాడు మండలం లంపకలోవ తీసుకువెళ్లి ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 800 మందికి వైద్య సేవలందించగా, సిటీకేబుల్ ఎండీ పంతం కొండలరావు, తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement