నిరసనల హోరు | Bash protests | Sakshi
Sakshi News home page

నిరసనల హోరు

Published Mon, Aug 5 2013 5:18 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM

Bash protests

సాక్షి, రాజమండ్రి : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఐదోరోజు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు కొనసాగాయి. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సమైక్యాంధ్ర ప్రాంతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేవిగా ఉండడంతో ఉద్యమస్ఫూర్తి మరింత పెరిగింది. ఆదివారం కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను నిలిపివేశారు. పెట్రోలు బంకులు పనిచేయలేదు. బస్సులు నడవలేదు. కుల సంఘాలూ పోరాటాలకు శ్రీ కారం చుట్టాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమం ఆగదని జేఏసీ ప్రకటించింది. సోమవారం బంద్ కొనసాగుతుందని పలు సంఘాలు ప్రకటించాయి.
 
 చాంబర్ ఆఫ్ కామర్స్ ‘సమైక్య’ సదస్సు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ది రాజమం డ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రిలో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహించింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి,  సిటీ ఎమ్మెల్యే రౌ తు సూర్యప్రకాశరావుతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు, వివిధ వర్గాల వారు సదస్సులో పాల్గొన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సకల జనులు సహాయ నిరాకరణకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పిలుపునిచ్చారు. తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని విజయలక్ష్మి స్ప ష్టం చేశారు. యూపీఏ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు పాల్పడిందని, తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సదస్సు తీర్మానించింది. ఉద్యమంలోకి అవాంఛనీయ శక్తు లు చొరబడకుండా జాగ్రత్త వహించాలని, కోస్తా ప్రాంతవాసుల మనోభావాలను కేంద్రానికి నివేదించాలని, ఉద్యమం పేరుతో విగ్రహాల విధ్వం సాన్ని నిరోధించాలని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. చాంబర్ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, సీనియర్ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
 
 కొనసాగుతున్న నిరసనలు
 వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతు న్న నిరసన శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమా ర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. సీసీసీ చానల్ యాంకర్ చోటూ ఆధ్వర్యంలో వంద మంది శ్యామలా సెంటర్‌లో ఒకరోజు దీక్ష చేపట్టారు. రజక సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించారు. జంగ మ సంఘాలు కోదండరామ్, కేసీఆర్, హరీష్‌రావుల అర్ధనగ్న చిత్రాలను ఊరేగించారు. శ్రీరా మా హరిదాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో వై.జంక్షన్‌లో వంటావార్పూ జరిగింది. గోదావరి గట్టుపై పురోహితులు మానవహా రం ప్రదర్శించారు. రాజమండ్రిలో ప్రైవేట్ కళాశాలలు సోమవారం బంద్ పాటించాలని రాజమండ్రి అన్ ఎయిడెడ్ కళాశాలల సం ఘం నిర్ణయించింది. కడియపు లంకలో నర్సరీలు, ఆటోలు బంద్ పాటించనున్నాయి.
 
 చిరంజీవికి ఎదురుగాలి
 కేంద్ర మంత్రి చిరంజీవి మంత్రి పదవికి రాజీ నామా చేయాలని ఆయన అభిమానులు డిమాం డు చేశారు. లేకపోతే త్వరలో విడుదలయ్యే రామ్‌చరణ్ తేజ సినిమాను అడ్డుకుంటామని హె చ్చరించారు. ఆ సినిమా పోస్టర్‌ను చింపేశారు. చిరంజీవి, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి బొమ్మలకు చీరలు కట్టి, సోనియాను ఇటలీ బొమ్మగా చిత్రించి ఫొటోలు విడుదల చేశారు. మండపేట మండలం కేశవరంలో చంద్రమళ్ల వీరేంద్ర(23) సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 కేసీఆర్‌పై  ఫిర్యాదు
 సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీశారని ఉభయ గోదావరి జిల్లాల న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో ఆదివారం సమావేశమై ఈ నెల 8వ తేదీ వరకు విధులు బహిష్కరించాలని  తీర్మానించారు. ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెడితే జేఏసీ తరఫున బెయిల్ ఇప్పించాలని నిర్ణయించారు.
 
 కాకినాడలో...
 కాకినాడలో బ్రాహ్మణ సంఘాలు భానుగుడి నుంచి ఇంద్రపాలెం వరకు ర్యాలీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్పన సెంటర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జేన్‌టీయూకే విద్యార్థులు బైఠాయింపు నిర్వహించారు. అమలాపురం జేఏసీ ఆధ్వర్యంలోని రిలే దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. ఎస్సీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, టీడీపీ జిల్లా కన్వీనర్ నిమ్మకాయల చినరాజప్ప సంఘీభావం తెలిపారు. ఆటో వర్కర్ల సంఘం ధర్నాలో వారు పాల్గొన్నారు.
 
 సమైక్య హోమాలు
 అమలాపురం శివారు ఇందిపల్లి గ్రామస్తులు, బ్రాహ్మణ సంఘం సభ్యులు ర్యాలీగా అమలాపురం వచ్చి గడియారం స్తంభం వద్ద ఆలయంలో సమైక్య హోమాలు నిర్వహించారు. ముమ్మిడివరం నియోజక వర్గంలో జేఏసీ రెండో రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రావులపాలెంలో మోటారు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మానవహారం, ర్యాలీ నిర్వహించారు. సోమవారం బంద్‌కు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో ఆదివారం నాలుగు మండలాల్లో బంద్ జరిగింది. అయినవిల్లిలో రిలే దీక్షలు చేపట్టారు. విద్యార్థి, ఉద్యోగ జేఏసీ సంఘాలు ధర్నాలు చేశాయి. మామిడికుదురులో ముస్లింలు ధర్నా చేశారు. నగరంలో ఓఎన్‌జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్, రిఫైనరీల నుంచి ఉత్పత్తుల తరలింపును అడ్డుకున్నారు. మలికిపురంలో జేఏసీ ధర్నా నిర్వహించింది.
 
 వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో..
 తూర్పుపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజోలు, కడలి గ్రామాల్లో రిలే దీక్షలు ప్రారంభించారు. పార్టీ కో ఆర్డినేటర్ మట్టాశైలజ హాజరయ్యారు. రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరులో సోనియా దిష్టిబొమ్మకు ఉరి వేసి వ్యాన్‌పై ఊరేగించారు. కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించారు. రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. బొమ్మూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పిఠాపురంలో జాతీయ రహదారిపై వంటావార్పూ జరిగింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామస్తులు జాతీయ రహదారిపై మోటారు సైకిల్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పెద్దాపురంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరగా, సామర్లకోటలో రిలే దీక్షలు చేపట్టారు. సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. లారీ యూనియన్ నేతలు జగ్గంపేటలో ధర్నా చేశారు. రిలే దీక్షల్లో వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు.
 
 దున్నపోతుపై కేసీఆర్ బొమ్మ
 మండపేటలో దున్నపోతుపై కేసీఆర్ బొమ్మ పెట్టి ఊరేగించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పోతంశెట్టి ప్రసాద్, పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. రామచంద్రపురం, కాజులూరు, కె.గంగవరం, ద్రాక్షారామల్లో రిలే దీక్షలు మూడోరోజు కొనసాగాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement