ఏపీ అభివృద్ధికి నంది ఉత్సవాలే నాంది | the Heritage Run held Hindupur | Sakshi
Sakshi News home page

ఏపీ అభివృద్ధికి నంది ఉత్సవాలే నాంది

Published Fri, Feb 26 2016 12:48 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఏపీ అభివృద్ధికి నంది ఉత్సవాలే నాంది - Sakshi

ఏపీ అభివృద్ధికి నంది ఉత్సవాలే నాంది

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్య

 హిందూపురం: అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లేపాక్షి నంది ఉత్సవాలే నాంది అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో లేపాక్షి నంది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్యాటక కేంద్రమైన లేపాక్షి తన నియోజకవర్గంలో ఉండడం పూర్వజన్మ సుకృతమన్నారు. కాగా ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. కోటి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 ఉత్సవాలకు సర్వం సిద్ధం: లేపాక్షి నంది ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యూరుు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్య, అశోక్ గజపతి రాజు, స్పీకర్ కోడెల శివప్రసాద్, తెలంగాణ , కర్ణాటక మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు వీరభద్రస్వామి ఆలయంలో జరిగే సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పూజలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement