మద్యం సేవించి నడిపితే తాటతీస్తాం : బసిరెడ్డి వాహనదారులెవరైనా సరే మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. అధిక వేగంతో వాహనాలు నడపడం వల్లే చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలకు రికార్డులు, వాహనదారుడికి లెసైన్స్ తప్పనిసరి. నిరంతరం దాడులు కొనసాగుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తనిఖీలు ముమ్మరం చేశాం.
సాక్షి, కడప : రాష్ర్ట ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. ఒకపక్క ఇసుక, మరో పక్క ఎర్రచందనంతోపాటు ప్రభుత్వ శాఖల ద్వారా రాబడికి ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రవాణా శాణ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
రవాణా, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా అక్రమ వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. లెసైన్స్ లేకున్నా, మద్యం తాగి నడిపినా, రికార్డులు లేకున్నా కేసుల మోత మోగిస్తున్నారు. నాలుగు రోజులుగా వరుస దాడులతో వాహన దారులు హడలెత్తుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రెండు శాఖలకు చెందిన అధికారులను 11 టీములుగా విభజించి దాడులకు ఉపక్రమించారు. కేవలం నాలుగు రోజుల్లో 1000కి పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడులు ఇకపై కూడా కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు.
వాహనదారుల్లో దడ
జిల్లాలోని ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు దాడులకు దిగడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. మూడు రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు సుమారు 100కి పైగా నమోదయ్యాయి. దీంతో మద్యం సేవించి వాహనాన్ని నడపటానికి చాలా మంది సాహసించడం లేదు. రోడ్లపై ఎక్కడ చూసినా అధికారులే కనిపిస్తుండటంతో ఎందుకొచ్చిన తంటా అనుకొని తప్పించుకోబోయి పట్టుబడుతున్నారు. ఆటోలు ఓవర్‌లోడుతో వచ్చినా, రికార్డులు లేకున్నా జరిమానాలు విధిస్తున్నారు.
ఒక ప్రక్క ఆధార్.. మరో పక్క కేసులు
రవాణా శాఖ అధికారులకు కొత్త కష్టం వచ్చింది. ఒక పక్క ఆధార్ అనుసంధానం, మరో పక్క కేసులను రాయాల్సి రావడంతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఇంతవరకు ఆధార్ సీడింగ్ అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం తాజాగా కేసులపై ృష్టి పెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్థం కావటం లేదని వాహనదారులు చర్చించుకుంటున్నారు.
డబ్బుల కోసం వేట!
Published Sat, Mar 7 2015 3:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement