strict punishment
-
మహిళలపై నేరం.. క్షమించరాని పాపం
జల్గావ్: మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని అన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం చట్టాలను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డల జోలికి రావొద్దని మృగాళ్లను హెచ్చరించారు. పశి్చమబెంగాల్‌లోని కోల్‌కతాలో 31 ఏళ్ల డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో మోదీ తీవ్రంగా స్పందించారు.మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం ‘లఖ్పతి దీదీ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మంది మహిళల కోసం రూ.2,500 కోట్ల రివాలి్వంగ్ ఫండ్ విడుదల చేశారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మోదీ ఇంకా ఏమన్నారంటే...మహిళల భద్రత అందరి బాధ్యత ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలను కాపాడుకోవాలి. వారి భద్రత దేశానికి ప్రాధాన్యతాంశం కావాలి. ఎర్రకోట నుంచి నేను ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నా. దేశంలో ఎక్కడికి వెళ్లినా మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నా. నా సోదరీమణులు, తల్లులు పడుతున్న బాధలు, ఆవేదన నాకు తెలుసు. మహిళలపై నేరం నిజంగా క్షమించరాని పాపం. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి.మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే దుర్మార్గులకు సాయం అందించేవారిని సైతం విడిచిపెట్టొద్దు. అది ఆసుపత్రి గానీ, పాఠశాల గానీ, ప్రభుత్వ ఆఫీసు గానీ, పోలీసు స్టేషన్ గానీ.. ఎక్కడైనా సరే మహిళల భద్రత పట్ల నిర్లక్ష్యం జరిగితే అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మహిళల జీవితాలను, గౌరవాన్ని కాపాడడం మనపై ఉన్న అతిపెద్ద బాధ్యత. అది సమాజం, ప్రభుత్వాల బాధ్యత.పదేళ్లలో రూ.9 లక్షల కోట్ల రుణాలు గత పదేళ్ల పరిపాలనలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. పథకాలు అమలు చేశాం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 2014 వరకూ మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పటి ప్రభుత్వాలు ఇచి్చన రుణాలు రూ.25,000 కోట్ల కంటే తక్కువే. కానీ, మేమొచ్చాక గత పదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చాం. సఖి మండల్ కార్యక్రమంతో అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. లఖ్పతి దీదీ పథకంతో మహిళల ఆదాయం పెరగడంతోపాటు భవిష్యత్తు తరాల సాధికారత సాధ్యమవుతుంది. మన దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది.ఇందులో మహిళామణుల పాత్ర చాలా కీలకం. అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యంతో దేశం ముందంజ వేస్తోంది. ప్రతి ఇంట్లో, పత్రి కుటుంబంలో సౌభాగ్యానికి మహిళలే గ్యారంటీ. కానీ, మహిళలకు సాయపడడానికి గ్యారంటీ ఇచ్చేవాళ్లు లేరు. మహిళల పేరిట ఆస్తులేవీ లేకపోతే వారికి బ్యాంకుల నుంచి రుణాలు రావడం కష్టమే. చిన్న వ్యాపారం చేసుకుందామన్నా రుణం దొరకడం లేదు. ఒక సోదరుడిగా, బిడ్డగా మహిళల కష్టాలను అర్థం చేసుకున్నా. వారి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నా.రెండు నెలల్లో 11 లక్షల మంది లఖ్పతి దీదీలు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించాం. మహిళల పేరిట జన్‌ధన్ ఖాతాలు తెరిపించాం. ముద్ర పథకం కింద ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలు అందుతున్నాయి. ఈ పథకంలో 70 శాతం మంది లబి్ధదారులు మహిళలే. ఈ పథకం వద్దని, రుణాలు తిరిగిరావని కొందరు వాదించారు. అయినప్పటికీ మహిళల పట్ల, వారి నిజాయితీ పట్ల నాకు విశ్వాసం ఉంది. వారు రుణాలు సక్రమంగా తిరిగి చెల్లిస్తుండడం సంతోషం కలిగిస్తోంది. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాం. 3 కోట్ల మంది అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ఎన్నికల సమయంలో మాటిచ్చా.మహిళాస్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి సంవత్సరానికి రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నవారంతా లక్షాధికారులైనట్లే. గత పదేళ్లలో కోటి మంది లఖ్పతి దీదీలను తయారు చేశాం. కేవలం రెండు నెలల్లో కొత్తగా 11 లక్షల మంది లఖ్పతి దీదీలు అయ్యారు. వీరిలో లక్ష మంది మహారాష్ట్ర మహిళలే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మహారాష్ట్ర ఒక షైనింగ్ స్టార్’’ అని మోదీ కొనియాడారు. -
గర్వపడుతున్నాం.. కానీ!
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి యువ సైనికులను అందించిన హమీర్పూర్ నుంచి కర్ణాటకలోని గుడిగెరె వరకు ఎన్నో గ్రామాల్లో శుక్రవారం విషాదం అలుముకుంది. ‘మా కొడుకు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం పట్ల గర్వంగా ఉంది. కానీ దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం ఉపేక్షించొద్దు’ అని బాధిత కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పలు గ్రామాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌ను విడిచిపెట్టొద్దు.. ‘మేం కొడుకును కోల్పోయాం. పాకిస్తాన్‌ను విడిచిపెట్టొద్దు. ఇలాంటి దాడులకు దిగకుండా ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జవాలికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ తిలక్‌రాజ్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్ల తిలక్‌రాజ్ మూడ్రోజుల క్రితమే ఇంటికి వచ్చి వెళ్లి సైన్యంలో చేరారు. ఇంతలోపే ఈ దారుణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తిలక్‌రాజ్ కుటుంబానికి సీఎం జయరామ్ ఠాకూర్ రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. 11నే ఇంటి నుంచి వెళ్లాడు.. ‘శ్రీనగర్ 115వ బెటాలియన్‌లో కొత్త పోస్టింగ్‌లో చేరడానికి ఈ నెల 11నే నా తమ్ముడు నాగ్‌పూర్ నుంచి వెళ్లాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఫోన్ చేసి మాట్లాడాను. కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జమ్మూ నుంచి బయల్దేరినట్లు చెప్పాడు. మధ్యాహ్నంలోపే అంతా జరిగిపోయింది’ అని అమర జవాన్ సంజయ్ రాజ్‌పుత్ సోదరుడు రాజేశ్ వాపోయారు. మహారాష్ట్ర బుల్డానా జిల్లాలోని మాల్కాపూర్కు చెందిన సంజయ్(45) నాలుగేళ్లుగా నాగ్‌పూర్‌లోని సీఆర్పీఎఫ్ 213వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. వెళ్లిన మూడ్రోజులకే నిర్జీవంగా.. పుల్వామా దాడిలో అసువులు బాసిన వారిలో ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ హర్పూర్ గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠి ఒకరు. 2 నెలల సెలవుల్ని తమ కుటుంబంతో సరదాగా గడిపిన పంకజ్ మూడ్రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరేందుకు కశ్మీర్‌కు వెళ్లాడు. ఇంతలోనే ఆ కుటుంబం అతడి మరణ వార్తను వినాల్సి వచ్చింది. ‘అధికారులు మాకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. మాతృభూమి కోసం నా కొడుకు ప్రాణాలర్పించడం చాలా గర్వంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు ప్రభుత్వం కచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే’నని పంకజ్ త్రిపాఠి తండ్రి ఓం ప్రకాశ్ త్రిపాఠి అన్నారు. చెట్టంత కొడుకే పోయాక ఏముంది? బిహార్‌కు చెందిన జవాన్లు సంజయ్‌కుమార్ సిన్హా, రతన్ఠాకూర్ సిన్హా ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల వేదన వర్ణనాతీతంగా ఉంది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాక ఇక తమకు దిక్కెవరంటూ విషణ్ణ వదనుడైన సంజయ్‌కుమార్ సిన్హా తండ్రి మహేంద్ర ప్రసాద్ సిన్హా రోదిస్తున్నారు. సంజయ్‌కుమార్‌కు పెళ్లీడొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. బాగల్పూర్కు చెందిన రతన్ఠాకూర్కు నాలుగేళ్ల కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భిణి. దియోరాలోని 30 ఏళ్ల విజయ్ కుమార్ మౌర్య ఇంటిలో రోదనలు మిన్నంటాయి. ఏడాదిన్నర కొడుకు, భార్యతో సంతోషంగా స్వగ్రామంలో గడిపిన మౌర్య ఫిబ్రవరి 9నే జమ్మూకు తిరిగి వెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లోని చక్కాసి రాజ్బంగ్షీపుర గ్రామానికి చెందిన జవాను బబ్లూ సాంత్రా కుటుంబ సభ్యుల ఆవేదన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఆధార్, పాన్ కార్డులతో మృతుల గుర్తింపు న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలు ముక్కలై చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టమైంది. దీంతో సిబ్బంది బ్యాగులు, వారి దుస్తులకున్న జేబుల్లోని ఆధార్, పాన్ కార్డులు, సీఆర్పీఎఫ్ గుర్తింపు కార్డులు, సెలవు దరఖాస్తు పత్రాలతోనే గుర్తించారు. మరికొందరిని వారు ధరించిన చేతి గడియారాలు, వారి పర్సులు తదితరాల ద్వారా సహోద్యోగులు గుర్తించారు. మరికొంతమంది చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుని ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారని ఓ అధికారి చెప్పారు. మరోవైపు ఆ సమయంలో కాన్వాయ్‌లో వెళ్తున్న జవాన్లందరి ఇళ్లకు అధికారులు ఫోన్లు చేసి.. జవాన్లలో ఎవ్వరూ గల్లంతు కాలేదనీ, చనిపోయినట్లుగా ప్రకటించిన జాబితా కచ్చితమైనదేనని చెప్పి, బతికున్న వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు. -
డబ్బుల కోసం వేట!
మద్యం సేవించి నడిపితే తాటతీస్తాం : బసిరెడ్డి వాహనదారులెవరైనా సరే మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. అధిక వేగంతో వాహనాలు నడపడం వల్లే చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలకు రికార్డులు, వాహనదారుడికి లెసైన్స్ తప్పనిసరి. నిరంతరం దాడులు కొనసాగుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తనిఖీలు ముమ్మరం చేశాం. సాక్షి, కడప : రాష్ర్ట ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. ఒకపక్క ఇసుక, మరో పక్క ఎర్రచందనంతోపాటు ప్రభుత్వ శాఖల ద్వారా రాబడికి ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రవాణా శాణ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రవాణా, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా అక్రమ వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. లెసైన్స్ లేకున్నా, మద్యం తాగి నడిపినా, రికార్డులు లేకున్నా కేసుల మోత మోగిస్తున్నారు. నాలుగు రోజులుగా వరుస దాడులతో వాహన దారులు హడలెత్తుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రెండు శాఖలకు చెందిన అధికారులను 11 టీములుగా విభజించి దాడులకు ఉపక్రమించారు. కేవలం నాలుగు రోజుల్లో 1000కి పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడులు ఇకపై కూడా కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. వాహనదారుల్లో దడ జిల్లాలోని ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు దాడులకు దిగడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. మూడు రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు సుమారు 100కి పైగా నమోదయ్యాయి. దీంతో మద్యం సేవించి వాహనాన్ని నడపటానికి చాలా మంది సాహసించడం లేదు. రోడ్లపై ఎక్కడ చూసినా అధికారులే కనిపిస్తుండటంతో ఎందుకొచ్చిన తంటా అనుకొని తప్పించుకోబోయి పట్టుబడుతున్నారు. ఆటోలు ఓవర్‌లోడుతో వచ్చినా, రికార్డులు లేకున్నా జరిమానాలు విధిస్తున్నారు. ఒక ప్రక్క ఆధార్.. మరో పక్క కేసులు రవాణా శాఖ అధికారులకు కొత్త కష్టం వచ్చింది. ఒక పక్క ఆధార్ అనుసంధానం, మరో పక్క కేసులను రాయాల్సి రావడంతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఇంతవరకు ఆధార్ సీడింగ్ అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం తాజాగా కేసులపై ృష్టి పెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్థం కావటం లేదని వాహనదారులు చర్చించుకుంటున్నారు.