- ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ప్రదీప్ శరీర భాగాలు
- నివేదిక తారుమారు చేస్తారేమోనని బంధువుల అనుమానం
సాక్షి, విశాఖపట్నం/కేజీహెచ్: అనుమానాస్పదంగా శవమై తేలిన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ మృతదేహానికి బుధవారం విశాఖ కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం తమ సమక్షంలోనే చేయాలని బంధువులు పట్టుబట్టడం దానికి అధికారులు నిరాకరించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ప్రదీప్ శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. నివేదిక రావడానికి వారం రోజులు పడుతుందని తెలిపారు. కాగా, తమ కళ్లెదుటే పోస్టుమార్టం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన అధికారులు తీరా ఇప్పుడు హైడ్రామా నడిపించారంటూ మృతుని బంధువులు మండిపడ్డారు.
కోర్టు అనుమతి ఉండాలంటున్నారని, తహసీల్దార్ సమక్షంలో కూడా పోస్టుమార్టం జరగలేదని, ఇదంతా చూస్తుంటే పోస్టుమార్టం నివేదికను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌లు నిందితులకు సహకరిస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు నిందితులకు మద్దతు ఉపసంహరించుకుని ప్రదీప్ మరణానికి కారణమైన వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నిబంధనల ప్రకారమే తన సమక్షంలోనే పోస్టుమార్టం జరిగిందని అనకాపల్లి తహసీల్దార్ కృష్ణమూర్తి తెలిపారు. బంధువులు ఆరోపిస్తున్నట్లుగా పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు. అంతా వీడియో, ఫొటోలు తీయించామన్నారు.
ఉద్రిక్తత నడుమ పోస్టుమార్టం
Published Thu, Nov 3 2016 2:00 AM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM
Advertisement
Advertisement