దేవినేని ఉమా
విజయవాడ : ప్రభుత్వం మంజూరు చేసిన ఒక్క రూపాయి కూడా వెనక్కిపోవడానికి వీలు లేదని, అందుబాటులో ఉన్న నిధులతో చెరువులు, కాలువల్లో పనులు చేపట్టాలని ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. ఇరిగేషన్ కార్యాలయంలో డ్వామా అధికారులతో నీరు-చెట్టు పథకంపై సోమవారం ఆయన సమీక్ష జరిపారు. అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల అవి మురిగిపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద పెండింగులో ఉన్న రూ.116 కోట్లు వెంటనే ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఏదైనా క్షేత్ర స్థాయి ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతానన్నారు.
ఇరిగేషన్, అటవీ శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో డ్వామా అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. డెల్టా ప్రాంతంలో కాలువలలో తూడు తొలగింపు, గుర్రపు డెక్క నిర్మూలన పనులు చేపట్టాల్సి ఉందని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పన సంచాలకులు వి.కరుణ, డ్వామా పథక సంచాలకులు పి.మాధవిలత, ఇరిగేషన్ ఎస్‌ఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రూపాయి కూడా వెనక్కి వెళ్లనీయొద్దు
Published Tue, Dec 16 2014 3:48 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
Advertisement