అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం.. క్రిస్‌మస్, సంక్రాంతి పండుగలను పేద జనం సంబరంగా జరుపుకోనిచ్చేలా లేదు. ఇప్పటి వరకూ రేషన్ దుకాణాల్లో పామాయిల్ సరఫరా చేయలేదు. సంక్రాంతికి కూడా వచ్చే పరిస్థితులు కనపడలేదు. దీంతో పండుగ పూట పిండి వంటలు చేసుకోవాలని ఆశించిన వారు వంటనూనెను బయటి మార్కెట్లో అధిక ధరకు కొనలేక కొర్కెలను చంపుకునే పరిస్థితి నెలకొంది. చక్కెర, గోధుమలు, బియ్యం, కిరోసిన్ మాత్రమే అరకొరగా వస్తున్నాయి. పామాయిల్ సరఫరా నిలిచి పోవడంతో జిల్లా ప్రజలపై ప్రతి నెల రూ. 2,53,081 వేల అదనపు భారం పడుతోంది. జిల్లాలో 11,53,713 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో అంత్యోదయ కార్డులు 1,19,969, తెలుపు రంగు కార్డులు 8,55,784, ట్యాప్ కార్డులు 10,759, రచ్చబండ-1,2 కార్డులు 70,209, రచ్చబండ-3 కార్డులు 96,997
మిగతా 2వ పేజీలో ఠ
పామారుుల్.. పాయే
ఉన్నాయి. ఇవి కాకుండా గులాబి కార్డులు 54,529 ఉన్నాయి. వీరందరూ ప్రతీనెలా రేషన్ దుకాణాల్లో పామాయిల్ కొనుగోలు చేస్తారు. రెండు నెలలుగా చౌక దుకాణాలకు పామాయిల్ సరఫరా కావడం లేదు. సబ్సిడీ ద్వారా అందించే పామాయిల్‌ను ప్రభుత్వం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనికి కేంద్రం ప్రభుత్వం రాయితీ భరిస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్రం రాయితీ భారాన్ని బాగా తగ్గించింది. దీంతో అక్కడి నుంచి పామాయిల్ దిగుమతి ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో చౌక దుకాణాలకు పామాయిల్ సరఫరాను పౌర సరఫరాల శాఖ నిలిపేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కార్డుదారులకు పామాయిల్ అందే పరిస్థితి లేదు. గులాబీ కార్డులు మినహా మిగిలిన కార్డులకు ప్రతి నెలా జిల్లాలో 2,685 చౌక దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ అవుతున్నారుు. సంవత్సరం క్రితం వీటికి 9 రకాల సబ్సిడీ సరుకులు ప్రభుత్వం నుండి సరఫరా అయ్యేవి. ప్రస్తుతం గోధుమలు, బియ్యం, చక్కెర, కిరోసిన్ మాత్రమే వస్తున్నాయి. గోధుమలు 1016 మెట్రిక్ టన్నులు, బియ్యం 17,030 మెట్రిక్ టన్నులు, చక్కెర 525 మెట్రిక్ టన్నులు, కిరోసిన్ 19 లక్షల 20 వేల కిలో లీటర్లు జిల్లాకు సరఫరా అవుతోంది. 2013 అక్టోబర్ నుండి పామాయిల్ అందని పరిస్థితి ఏర్పడింది.
పండుగ భారం తప్పదు
బహిరంగ మార్కెట్లో పామాయిల్ ధర కిలో 60-65 రూపాయలు పలుకుతోంది. చౌక దుకాణాల్లో సరఫరా చేసే పామాయిల్ ప్యాకెట్ ధర 40 రూపాయిలు మాత్రమే. ఒక్కో కార్డుకు లీటర్ చొప్పున అందజే సేవారు. ఈ లెక్కన ప్రతీ కార్డుదారుడు వంట నూనెను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలంటే లీటరుపై 20-25 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో రూ. 2,53,081 కోట్ల రూపాయలకుపైగా కార్డుదారులపై అదనపు భారం పడనుంది. పౌర సరఫరాల శాఖ గతంలో పండుగల సమయంలో పలుమార్లు చక్కెర, గోధుమలు, కందిపప్పు రెండింతలు సరఫరా చేసేది. ఈ ఏడాది ఆ పరిస్థితీ లేదు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పండుగ ఖర్చు తలకు మించిన భారం కానుంది.
మరచిపోవాల్సిందే !
Published Sun, Dec 14 2014 2:02 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement