నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రావణ కాష్టంలా మార్చిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నగ రంలోని వీఆర్‌సీ సెంటర్‌లో రిలేదీక్షలు చేస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ అధ్యాపకులకు శనివారం ఎంపీ మేకపాటి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాత్కాలిక, స్వార్థ ప్రయోజనాల కోసం దుర్మార్గపు చర్యలకు పాల్పడితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, నెల్లూరు సిటీ కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి, రామిరెడ్డి, సుగుణారెడ్డి, పాండురంగారెడ్డి, తురక సూరి, సురేష్, బాపూజీ, నాగేశ్వరరావు, శివ ప్రసాద్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
పాహిమాం..పాహిమాం
నెల్లూరు(వేదాయపాళెం) : పాహిమాం..పాహిమాం..సమైక్యాంధ్ర పాహిమాం..అంటూ సింహపురి బ్రాహ్మణులు గళమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మొదట ఆత్మకూరు బస్టాండు సెంటర్లోని పొట్టిశ్రీరాముల విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనగా బోసుబొమ్మ, కనకమహల్, గాంధీబొమ్మ, వీఆర్సీ మీదుగా మద్రాస్ బస్టాండు వరకు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించి నిరసన తెలి పారు. యోగాసనాలు వేసి ఖబడ్దార్..ఖబడ్దార్ తెలంగాణ రౌడీల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎల్లవేళలా భగవంతుని ధ్యానంలో ఉండే తాము సైతం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నామంటే సమైక్యంపై తమకున్న విశ్వాసం గుర్తించాలన్నారు.
ఎంపీ మేకపాటి మద్దతు
బ్రాహ్మణుల నిరసన ప్రదర్శనకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. వీఆర్ సీ సెంటర్ సమీపంలోకి బ్రాహ్మణుల ప్రదర్శన చేరుకోగానే ఎంపీతో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సిటీ కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి తదితరులు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ బ్రాహ్మణ సంఘాల నేతలు డాక్టర్ యనమండ్ర నాగదేవీప్రసాద్, మాచవోలు రమేష్‌శర్మ, ఉచ్చి భువనేశ్వరిప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి అజయ్‌కుమార్, వేదగిరి ఫణిశర్మ, చంద్రశేఖర్, శ్రీనివాసకుమార్, రాళ్లపల్లి రామసుబ్బారావు, సీవీ సుబ్రహ్మణ్యం, ఆలూరి శిరోమణిశర్మ పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు
Published Sun, Sep 8 2013 5:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement