ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలై న పిటిషన్లపై విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. ఈ కేసులో తుది వాదనలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కేసును జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది సంజయ్ పరేఖ్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణా నది, కొండవీటి వాగుకు వరదలొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందన్నారు.
రాజధాని ఎంపికకు ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా అమరావతిని ఎంపిక చేసిందని సంజయ్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.కాగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని చేపడుతోందని సామాజికవేత్త మేథాపాట్కర్ విమర్శించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ సందర్భంగా మంగళవారం ఆమె కోర్టుకు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కృష్ణా, కొండవీటికి వరదొస్తే అమరావతికి ముప్పు
Published Wed, Aug 31 2016 2:15 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement