ఆత్మకూరు, న్యూస్‌లైన్: వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం ఆత్మకూరు నియోజక వర్గంలో డెంగీ పంజా విసిరింది. మంగళవారం ఇద్దరు బాలురు డెంగీ వ్యాధి బారిన పడి మృతి చెందారు. ఇప్పటికే రెండంకెల సంఖ్యలో డెంగీ తో మృతిచెందినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖలో స్పందన కరువైంది. ఆత్మకూ రులోని ఒందూరుగుంటకు చెందిన గుర్నాథం భూషయ్య, బుజ్జమ్మ కుమారుడు హరిశ్చంద్రప్రసాద్ (14)కు వారం క్రితం జ్వరం వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. అయితే జ్వరం అదుపులోకి రాకపోవడంతో సోమవారం సాయంత్రం నెల్లూరుకు తరలించారు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం చికిత్స పొందుతూ మరణించాడు.
సంగం : మండలంలోని కొరిమెర్లకు చెందిన రాజశేఖరరెడ్డి (12) డెంగీ జ్వరంతో చెన్నైలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రాజశేఖరరెడ్డికి వారం రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో సంగం, బుచ్చిరెడ్డిపాళెంలోని వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేయించిప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం బాలుడిని చెన్నైకు తరలించిన విషయం విదితమే. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో కొరిమెర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పంజా విసిరిన డెంగీ
Published Wed, Oct 9 2013 4:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement