సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడిసహా 15మందికి రిమాండ్
నరసరావుపేట రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతూనే ఉంది. దున్నపోతు ఈనిందనగానే దూడను కట్టేయమన్న సామెతగా కేసుతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన వైనం గురువారం చోటుచేసుకుంది. గత ఆదివారం రాత్రి నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో గల కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడి వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఒక అకతాయి విసిరిన గరిటె తగిలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి ఉన్న అద్దం పగిలింది.
దీనిని అదనుగా తీసుకొన్న గ్రామ టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు పెండ్లికుమారుడి తండ్రి, బంధువులను స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అర్ధరాత్రి పార్టీ సానుభూతిపరులు, నాయకుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు ఈ కేసుతో తమకేమి సంబంధం లేదని ప్రకటించిన అదే గ్రామానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన శంకరయాదవ్, సర్పంచ్ నల్లగంగుల యజ్ఞారెడ్డితో పాటు మరో 13మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు. రిమాండ్ విషయాన్ని రూరల్ ఎస్‌ఐ జేసీహెచ్ వెంకటేశ్వర్లు ధ్రువీకరించారు.
వైఎస్సార్ సీపీ నాయకుల అక్రమ అరెస్టు
Published Fri, Mar 25 2016 1:56 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement