- టీడీపీ కార్యకర్త ఆగడం
- సర్పంచ్ వైఎస్సార్ సీపీ నేత
- ఇంటి గేటు, బైక్ పాక్షికంగా ధ్వంసం
- అర్ధరాత్రి సమయంలో గొడవ
గౌరవరం (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకోవడంతో గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణు ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పో తోంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కక్ష తీర్చుకునేందుకు పరోక్ష దాడులకు దిగుతున్నారు. దీంతో మండలంలోని కొన్ని గ్రామాల్లో వైఎ స్సార్‌సీపీ కార్యకర్తలు భయాందోళనలకు గురవుతున్నారు.
మండలంలోని గౌరవరంలో స ర్పంచ్ గోవా రామకృష్ణ ఇంటిపై టీడీపీ కార్యకర్త దాడికి యత్నించిన ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజు గ్రామంలోని బీసీ కాలనీలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. అప్పటినుంచి గ్రామంలో టీ డీపీ శ్రేణులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వై ఎస్సార్ సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వైఎస్సార్ సీపీ నేత, గ్రామ సర్పంచ్ రామకృష్ణ ఇంటి వ ద్దకు టీడీపీ కార్యకర్త ఉమారెడ్డి శ్రీనివాసరావు మద్యం తాగి వచ్చాడు. ఇంటి గేటును విర గ్గొట్టాడు. ఇంటిముందు ఉన్న బైక్‌పై దాడి చే యడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ సంద ర్భంగా మద్యం సీసా పగులగొట్టాడు. దీంతో రామకృష్ణ, అతని కుటుం బసభ్యులు బయటకు రాగా శ్రీనివాసరావు వారిని దుర్భాషలాడాడు.
అర్ధ రాత్రి సమయం లో ఈ గొడవ ఏమిటని రామకృష్ణ వారిస్తున్నప్పటికీ వినకుండా దూషించాడు. రామకృష్ణ వెంటనే ఫోన్‌లో పోలీస్‌స్టేష న్‌లో ఫిర్యాదు చే స్తుండగా శ్రీనివాసరావు అక్కడనుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి చిల్లకల్లు పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. ఘటనాస్థలిని ఎ స్సై నాగరాజు ఆదివారం సందర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యకర్త దాడి వెనుక కొందరి ప్రమేయం : సర్పంచ్
టీడీపీ కార్యకర్త తన ఇంటిపై దాడికి యత్నం ఘటన వెనుక గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని సర్పంచ్ రామకృష్ణ ఆరోపించారు. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నిక ల్లో గ్రామంలో వైఎస్సార్ సీపీకి మెజారిటీ రావడంతో పార్టీకి చెందిన వారిపై టీడీపీ శ్రేణులు కక్షతో దాడులకు యత్నిస్తున్నాయన్నారు. తన ఇంటిపై దాడికి యత్నించిన వ్యక్తి, అతడిని ప్రో త్సహించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.