సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణలో భాగంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వినూత్న సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా రైతు బజార్లు వంటి బహిరంగ మార్కెట్లలో డ్రోన్లతో థర్మల్ స్క్రీనింగ్ (శరీర ఉష్ణోగ్రత చూడటం) చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు వంటి వాటిలోకి ఒక్కొక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలంటే చాలా కష్టమైన పనికావడంతో ఇందుకోసం డ్రోన్లను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఈవో ఆళ్ల రవీంద్రరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
- డ్రోన్‌కు థర్మల్ స్క్రీనింగ్ పరికరాన్ని అమర్చి జనం కొనుగోళ్లు చేసుకుంటుండగానే శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాం.
- ప్రస్తుతం దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద పరిశీలిస్తున్నాం.. విజయవంతమైతే రాష్ట్రమంతా అమల్లోకి తెస్తాం.
- రెడ్ జోన్‌లలో జన సంచారాన్ని అనుమతించే అవకాశం లేకపోవడంతో వారికి సూచనలు, సలహాలిచ్చేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నాం.
- ఇప్పటికే నెల్లూరులో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ వినియోగిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment