Thermal Screening
-
తొలి దశకు సర్వం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అస్సాంలో 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంలో తృణమూల్ కాంగ్రెస్, తూర్పున పాగా వెయ్యాలన్న వ్యూహంలో బీజేపీ నిలవడంతో హోరాహోరీ పోరు నెలకొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ ఈ 30 స్థానాలకు గాను 26 సీట్లలో గెలుపొందింది. అయితే గత అయిదేళ్లలో ఈ ప్రాంతంలో బీజేపీ పట్టు బిగించి అధికారపక్షానికి సవాల్ విసురుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి సొంత జిల్లా మేదినిపూర్ జిల్లాలో పోలింగ్ జరుగుతూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఎంసీ, బీజేపీలు 29 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపితే, లెఫ్ట్–కాంగ్రెస్–ఐఎస్ఎఫ్ కూటమి మొత్తం 30 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. అధికారాన్ని కాపాడుకోవడానికి పకడ్బందీ వ్యూహాలను రచించిన బీజేపీ–ఏజీపీ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, లోకల్ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్‌ల నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. గత ఎన్నికల్లో బీజేపీ–ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొందాయి. భద్రతా బలగాల నీడలో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన జంగల్మహల్లో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతమై జర్గ్రామ్ జిల్లాలో ప్రతీ పోలింగ్ బూత్ దగ్గర 11 మంది పారామిలటరీ సిబ్బంది మోహరించినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1307 పోలింగ్ బృందాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించి 127 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పురూలియాలో 185 కంపెనీలు, పూర్వ మేదినీపూర్‌లో 148 కంపెనీలు, బంకూరాలో 83 కంపెనీల బలగాలు మోహరించాయి. ఒక్కో కంపెనీలో వంద మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రానికి చెందిన 22 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు. బరిలో ఉన్న ప్రముఖులు పశ్చిమబెంగాల్లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు. -
పాస్ ఉంటే పగటి పూటే అనుమతిస్తాం
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. డీజీపీ ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని సూచించారు. పాస్ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్‌పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. -
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!
న్యూఢిల్లీ : కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతిచోట థర్మల్ స్క్రీనింగ్ చేయడం తప్పని సరిగా మారింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిని ఏయిర్ పోర్టులోనే స్క్రీనింగ్ చేసి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నుంచి తప్పించుకొని ఓ వృద్ధుడు పరారైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. గార్డెన్ ప్రాంతానికి చెందిన హర్జిత్ సింగ్(72) అనే వ్యక్తి శనివారం AI 1916 విమానంలో కజకిస్తాన్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. విమానాశ్రమంలో దిగిన అనంతరం అధికారుల కళ్లు గప్పి టెర్మినల్ -3 వద్ద ఉన్న స్క్రీనింగ్ హాల్ నుంచి తప్పించికొని పరారయ్యాడు. (సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పి..) ఈ విషయంపై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సింగ్ ఉద్దేశపూర్వకంగా స్క్రీనింగ్ విధానాన్ని తప్పించుకొని వెళ్లినట్లు అధికారులు పోలీసులకు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణీకుడు ఎయిర్‌పోర్టు అధికారులు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఇంటి చిరునామా ప్రస్తుతం వాడుకలో లేనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో సింగ్ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిన వెహికిల్ ఆధారంగా ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి అతడిని 14 రోజులు క్వారంటైన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. (లగ్జరీ బైక్‌పై చీఫ్ జస్టిస్; ఫోటోలు వైరల్) -
రెల్వేస్టేషన్లలో ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించే ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్ పద్ధతిని దక్షిణ మధ్య రైల్వే మొదటిసారి అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేశారు. బుల్లెట్ థర్మల్ ఇమేజ్ స్క్రీనింగ్ కెమెరాలుగా పరిగణించే ఈ వ్యవస్థలో అలారం, థర్మల్ స్క్రీనింగ్ కెమెరా, వీడియో రికార్డర్, ఎల్ఈడీ మానిటర్ ఉంటాయి. ప్రస్తుతం అత్యవçసర ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిర్ధారిత టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. కానీ ఒక్కో ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేసి లోపలికి అనుమతించే క్రమంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు ఈ బుల్లెట్ థర్మల్ ఇమేజింగ్ స్క్రీనింగ్ కెమెరాలు దోహదం చేస్తాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మూడో ప్రవేశ ద్వారం వద్ద, నాంపల్లి రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ కెమెరాల ద్వారా ఒకేసారి 30 మంది శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించవచ్చు. ప్రవేశ ద్వారాలకు 6 మీటర్ల దూరంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరా ముందు ప్రయాణికులు నిలబడగానే అలారం మోగుతుంది. ఆటోమేటిక్‌గా వారి శరీర ఉష్ణోగ్రతలు ఎల్ఈడీ మానిటర్‌పై కనిపిస్తాయి. ఈ డేటాను తిరిగి çపరిశీలించేందుకు వీలుగా భద్రపర్చుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే ఆరోగ్య విభాగం, ఆర్పీఎఫ్ పోలీసులు ఈ థర్మల్ స్క్రీనింగ్‌లను పర్యవేక్షిస్తారు. ఒక్కో కెమెరాను రూ.4.4 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. -
థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేశాకే భక్తులకు అనుమతి
-
ఇక మీదట తీర్థ ప్రసాదాలు బంద్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు 2 నెలల నుంచి దేశంలోని ఆలయాలన్ని మూసి వేశారు. లాక్డౌన్ 5.0లో దేశవ్యాప్తంగా ఈ నెల 8నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థన స్థలాలను తెరిచేందుకు అనుమతివ్వనున్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. (సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి) 1. ప్రార్థన మందిరాలల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి. 2. ప్రవేశ మార్గంలో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనసరి. 3. ప్రార్థన మందిరాలకు వచ్చేవారిని దశలవారిగా పంపించాలి. క్యూలైన్లో 2 మీటర్ల భౌతిక దూరం పాటించేలా చూడాలి. 4. భక్తి గీతాలను ఆలపించడానికి వీలులేదు. బదులుగా రికార్డు చేసినవి వినిపించాలి. 5. ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదు. 6. అన్న ప్రసాదం తయారు చేసే సమయంలో, పంచేటప్పుడు భౌతిక దూరం తప్పని సరి. 7. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి. 8. మతపరమైన సమావేశాలు, జనాలు గుంపులుగా చేరే వేడుకలు నిర్వహించడం నిషేధం. -
‘గురుకులం’లో రోజూ థర్మల్ స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు తిరిగి ప్రారంభంకా నుండటంతో విద్యార్థుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తల పై గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులకు వసతి, పరీక్షా కేంద్రాల వరకు రవాణా సౌకర్యం లాంటి ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు ఉపక్రమించాయి. రాష్ట్రవ్యాప్తంగా 900 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల పాఠశాలల నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే తెలుగు పేపర్–1, 2, హిందీ పరీక్షలు ముగియగా... కరోనా నేపథ్యంలో మిగతా పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తిరిగి ఈ నెల 8 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో గురుకుల విద్యార్థులను వారం ముందే పాఠశాలలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. సోమవారం నాటికి 90 శాతం మంది విద్యార్థులు చేరుకున్నారు. అనుక్షణం అప్రమత్తం: ఇప్పటికే అన్ని పాఠశాలలను సోడియం హైపోక్లోరైడ్‌తో మూడుసార్లు శానిటైజ్ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి వ్యక్తిగత శానిటైజర్, సబ్బు, మాస్కులు అందిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో గురుకుల పాఠశాలల సిబ్బంది మే 28 నుంచే విధులకు హాజరువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా భౌతిక దూరంపాటించేలా బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టడీ హాలులో కుర్చీలను ఏర్పాటు చేశారు. వంట సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్ పాటిస్తూ గ్లౌజులు, మాస్కులు ధరించి వంట వడ్డించేలా సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి రోజూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. దీనికోసంప్రతి స్కూల్‌కు ఒక ధర్మల్ స్క్రీనింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలుంటే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గురుకుల పాఠశాలలో ఒక హెల్త్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసిన సొసైటీ అధికారులు... 24గంటలు అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోగనిరోధక శక్తి పెరిగేలా ఆహారం.. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పట్ల అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాల ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పోషకాహారాన్ని అందించే లా డైట్ చార్ట్‌ను మార్చామని, రోగ నిరోధకశక్తి పెరిగే ఆహార పదార్థాలు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. -
రైలు బండ్లు కదిలాయ్..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సాధారణ ప్రయాణికుల రైళ్లు చాలాకాలం తర్వాత సోమవారం పట్టాలెక్కాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించాయి. 70 రోజులకు పైగా బోసిపోయిన స్టేషన్లలో సందడి నెలకొంది. గత కొద్ది రోజులుగా పలు శివారు స్టేషన్ల నుంచి శ్రామిక్ రైళ్లను నడిపిన విషయం తెలిసిందే. కానీ సోమవారం ఒక్క రోజే 9 రైళ్లు బయల్దేరాయి. సుమారు 13 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. సోమవారం ఉదయం నాంపల్లి నుంచి బయల్దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో 958 మంది ప్రయాణికులు బయల్దేరగా, సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అత్యధికంగా 1,423 మంది ఊళ్లకు వెళ్లారు. సాధారణ ప్రయాణికులతో పాటు, శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేని కార్మికులు సైతం ఈ ట్రైన్లో వెళ్లారు. సికింద్రాబాద్–ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 1,167 మంది, సికింద్రాబాద్–గుంటూరు మధ్య రాకపోకలు సాగించిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో 2,210 (రెండు వైపులా) మంది ప్రయాణించారు. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్లిన రాయలసీయ ఎక్స్‌ప్రెస్ మాత్రం 520 మంది ప్రయాణికులతో బయల్దేరింది. అలాగే ముంబైకి వెళ్లిన హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ 587 వరకు వెళ్లారు. తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మిగతా అన్ని రైళ్లు దాదాపు బెర్తుల సామర్థ్యం మేర బయల్దేరాయి. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు బారులుదీరిన ప్రయాణికుల బయల్దేరిన రైళ్లు ఇవే.. హైదరాబాద్–న్యూఢిల్లీ (02723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–ధానాపూర్ (02791) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (రెండు వైపులా)(07201/07202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–హౌరా (02704) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–విశాఖపట్నం (02728) గోదావరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి–నిజామాబాద్ (02793) రాయలసీమ ఎక్స్‌ప్రెస్, నాందేడ్–అమృత్సర్ (02715) సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–ముంబై (02702) హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయల్దేరాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రత, కరోనా నిబంధనల అమలు, తదితర అంశాల పట్ల దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేక శ్రద్ధ చూపారు. నాంపల్లి, సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, తిరుపతి, గుంటూరు, తదితర అన్ని ప్రధాన స్టేషన్లలో విస్తృత ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ కోసం భారీ క్యూలు... రైలు బయల్దేరే సమయానికి 90 నిమిషాలు ముందుగా స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉండగా, చాలామంది అంతకంటే ముందే వచ్చారు. ఉదయం 6 గంటలకు బయల్దేరే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత బయల్దేరే ధానాపూర్, గోల్కొండ, రాయలసీమ తదితర రైళ్ల కోసం ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ క్రమంలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి అనుమతించేందుకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో ప్రయాణికులు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాల్సి వచ్చింది. సికింద్రాబాద్ ఒకటి, 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లకు చేరుకొనేందుకు ప్రయాణికుల క్యూలైన్లు రెతిఫైల్ బస్‌స్టేషన్‌ను దాటిపోయాయి. మాస్కులు ధరించి ట్రైన్ టికెట్‌తో వచ్చిన వారిని మాత్రమే భౌతిక దూరంలో ఉంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల అనంతరం స్టేషన్లోకి పంపారు. ఇందుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్.. ప్రయాణికుల రాకపోకల కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేసి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని నిర్ధారణ అయ్యాకే అనుమతించారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను తాకకుండా స్క్రీనింగ్ చేసే ఆటోమేటిక్ థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. అలాగే టికెట్ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ప్రయాణికుడి ఉష్ణోగ్రతలు నమోదు చేశారు. ఇందుకు పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యేలా చర్యలు చేపట్టారు. భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేశారు. రైళ్లలోనూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్లలోని ఫుడ్ కోర్టుల్లో ప్యాకింగ్ ఆహారాన్ని, వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచినా.. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడమే మంచిదని అధికారులు ఇప్పటికే సూచించారు. బెడ్షీట్లు, దుప్పట్లు కూడా ప్రయాణికులు సొంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. -
కూతపెట్టిన రైళ్లు
సాక్షి, అమరావతి: దాదాపు 71 రోజుల తర్వాత రైళ్లు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు సందడిగా మారాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్లకు చేరుకున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివచ్చారు. స్టేషన్లలో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపించారు. ప్రయాణం పూర్తయ్యేవరకు ప్రయాణికులు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, గుంతకల్ ఇలా ప్రధాన స్టేషన్లన్నీ కళకళలాడాయి. ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లను కూడా జారీ చేయనున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి సోమవారం వివిధ ప్రాంతాలకు 9 రైళ్లు బయలుదేరాయి. ► హైరిస్క్ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు చేసి వారం పాటు క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం మరో వారం హోం క్వారంటైన్లో ఉండాలని నిబంధనలు విధించారు. ► చెన్నై, ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లను హైరిస్క్ ఉన్నవిగా గుర్తించారు. ► ఏపీ హెల్త్ ప్రొటోకాల్‌ను ప్రకటించిన 18 స్టేషన్లలో దిగే ప్రయాణికుల్లో ప్రతి కంపార్ట్మెంట్లో 5 శాతం మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైన చిన్నారులు, పదేళ్ల లోపు ఉన్నవారు, గర్భిణులు, అస్వస్థతకు గురైన వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌కు అనుమతిస్తున్నారు. వీరికి రైల్వే స్టేషన్లలోనే స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తారు. ► విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గుర్తించిన ల్యాబ్ నుంచి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. 18 రైల్వేస్టేషన్లలోనే హాల్ట్ సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైన 200 ప్రత్యేక రైళ్లలో ఏపీ మీదుగా 22 రైళ్లు వెళుతున్నాయి. వీటికి 71 హాల్ట్లను ఇవ్వడంతో వీటన్నింటిలో ప్రయాణికులకు పరీక్షలు చేయడం కష్టం కాబట్టి 18 రైల్వేస్టేషన్లకు మాత్రమే హాల్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్‌కు లేఖ రాశారు. ఇందుకు సానుకూల స్పందన వచ్చింది. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, మంగళగిరి, కడప, గుంతకల్, ఆదోని, మంత్రాలయం, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు, కుప్పం, రేణిగుంటల్లో మాత్రమే హాల్ట్ ఉంటుంది. ఏపీ మీదుగా నడిచిన 11 జతల (22) రైళ్లు ఇవే.. ► రెండు వైపులా నడిచే హైదరాబాద్–విశాఖపట్నం (గోదావరి ఎక్స్‌ప్రెస్), ► గుంటూరు–సికింద్రాబాద్ (గోల్కొండ), ► తిరుపతి–నిజాముద్దీన్ (రాయలసీమ), ► విశాఖ–న్యూఢిల్లీ (ఏపీ ఎక్స్‌ప్రెస్), ► ముంబై–భువనేశ్వర్ (కోణార్క్), ► ముంబై–బెంగళూరు (ఉద్యాన్), ► దాణాపూర్–బెంగళూరు (సంఘమిత్ర), ► హౌరా–సికింద్రాబాద్ (ఫలక్‌నుమా), ► హౌరా–యశ్వంత్‌పూర్ (దురంతో), ► న్యూఢిల్లీ–బెంగళూరు, న్యూఢిల్లీ–చెన్నై. -
మెట్రో ప్రయాణం: మరో 30 సెకన్లు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో దశ లాక్డౌన్ ముగిసిన తర్వాత కేంద్రం మెట్రో ప్రయాణాలకు అనుమతిస్తే... ప్రతి స్టేషన్లో రైలు ఆగే వ్యవధిని పెంచాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎమ్ఆర్సీ) ఆలోచిస్తుంది. రైలులో సామాజిక దూరం అమలయ్యేలా చూడాలని భావిస్తుంది. లాక్‌డౌన్‌కు ముందు మెట్రో రైలు ప్రతి స్టేషన్లో 30 సెకన్ల పాటు ఆగేది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ వ్యవధిని మరో 30 సెకన్ల పాటు పెంచాలని డీఎమ్ఆర్సీ చూస్తుంది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్ఓపీ)ని రూపొందించింది. మే 31 నాటికి దేశంలో నాల్గవ దశ లాక్డౌన్ ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఈ ఎస్ఓపీ ఆమోదం పొందనుంది. ఇప్పటికే ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ డీఎమ్ఆర్సీ సీనియర్ అధికారులతో దీనిపై చర్చించారు. కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతిస్తే.. సామాజిక దూరం పాటించడం, రైళ్లను శుభ్రపర్చడం వంటి అంశాల గురించి చర్చించారు. ఈ క్రమంలో డీఎమ్ఆర్సీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మెట్రోలో సామాజిక దూరం పాటించడం కోసం రెండు సీట్లకు మధ్య ఓ సీటు వదిలేయాలి. ప్రతి ట్రిప్ పూర్తి కాగానే రైళ్లను డిసిన్ఫెక్టెంట్ చేయాలి. స్టేషన్లో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలి. టోకెన్లతో పాటు కాంటాక్ట్‌లెస్ టికెటింగ్‌ను అమలు పర్చాలని భావిస్తున్నాం. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే... జరిమానాతో పాటు.. జైలు శిక్ష కూడా విధిస్తాం. స్టేషన్లోకి వచ్చేటప్పుడు ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఈ మేరకు అదనపు సిబ్బందని నియమించాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. -
వెంట తెస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గడం లేదు. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కొంతమేరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా అధిక కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పట్లో కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు సడలింపులివ్వడంతో జాతీయంగా, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న మన రాష్ట్రానికి చెందినవారు, ఇతరులు వస్తుండటంతో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒకవైపు వివిధ రాష్ట్రాల్లో ఉండే మన తెలంగాణ వాసులు, అలాగే విదేశాల్లో ఉండే మనవారు కూడా ఇక్కడకు వస్తున్నారు. దీంతో వారి ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సడలింపుల తర్వాత సోమవారం నాటికి విదేశాల నుంచి మన రాష్ట్రానికి ప్రత్యేక విమానాల్లో వచ్చినవారిలో 28 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 145 మంది వలసదారులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఉదాహరణకు ఒక్క సోమవారం నాడే రాష్ట్రంలో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, అందులో 32 కేసులు రాష్ట్రంలో ఉన్నవారికి కరోనా సోకింది. మిగిలిన కేసుల్లో వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మంది, మహారాష్ట్రకు చెందినవారు ఒకరున్నారు. అంటే ఒకరోజు నమోదైన కేసుల్లో సగానికిపైగా వలసలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారే ఉండటం గమనార్హం. ఈ కేసులను ఎదుర్కోవడం ఎలా? విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రయాణికులు వస్తుండటంపై వైద్య, ఆరోగ్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘అనుమానితులను గుర్తించి పరీక్షలు చేస్తున్నాం. గ్రామాల్లోనూ నిఘా పెట్టాం. కొత్త వాళ్లు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరాం. చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్‌లు పెట్టి లక్షణాలున్న వారిని పరీక్షిస్తున్నాం’ అని ఒక అధికారి తెలిపారు. ‘ఇప్పటికే లక్షకుపైగా వలసదారులు రాష్ట్రానికి వచ్చారు. వారిలో కొందరు మా కళ్లుగప్పి ఇళ్లకు వెళ్లారు. వారి కోసం వెతుకుతున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేసి, మిగిలిన వారిని హోం క్వారంటైన్లో ఉంచుతున్నామని మరో అధికారి చెప్పారు. -
ఐసీయూ తరహాలో..
సాక్షి, సిటీ నెట్వర్క్: కోవిడ్ సరికొత్త పాఠాలు నేర్పించింది. అన్ని రంగాలు, సేవల్లోనూ కరోనా నిబంధనలకుఅనుగుణమైన మార్పులు వచ్చేశాయి.కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత సేవలనిర్వచనాలు మారాయి. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాల్లోనూ కోవిడ్ కట్టడి చర్యలు తప్పనిసరిగా మారాయి.మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిచోట్లా దర్శనమిస్తున్నాయి.పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లను తలపించే డ్రెస్సులతో సెలూన్లు సేవలందజేస్తున్నాయి. ఒకసారి వినియోగించి పారేసే సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్ కిట్లు వినియోగంలోకి వచ్చాయి. మరోవైపు జనం సైతం ఎక్కడికెళ్లినా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛందంగానే భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు, మొబైల్ ఫోన్ షాపులు, వస్త్ర దుకాణాలు తదితర చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం లాక్డౌన్ నిబంధనలు భారీగా సడలించి అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో నగరంలో సందడి పెరిగింది. రహదారులపై వాహనాల రాకపోకలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ రకాల అవసరాల కోసం బయటకి వచ్చే నగరవాసులు కోవిడ్ నిబంధనలను పాటించేందుకే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు వ్యాపార సంస్థలు సైతం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ షోరూమ్‌లలో థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటేనే అనుమతిస్తున్నారు. షోరూమ్ బయటే కాలుతో నొక్కి వినియోగించేందుకు అనువైన శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చినప్పుడు భౌతిక దూరానికి విఘాతం కలగకుండా చిన్న చిన్న బృందాలుగా ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. మరోవైపు పలు దుకాణాల్లో సిబ్బంది సంఖ్యను సైతం బాగా తగ్గించి సేవలు అందజేస్తున్నారు. మరోవైపు సుదీర్ఘమైన లాక్డౌన్ కారణంగా షాపులు మూసి ఉంచడం, కోవిడ్ నిబంధనల దృష్ట్యా పలు వస్తువులు, సేవల ధరలు సైతం పెరిగాయి. సాధారణ రోజుల్లో ఉన్న ధరలపై 20 నుంచి 26 శాతం వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఐసీయూ తరహాలో.. 'మై సర్వీస్ వెరీ సేఫ్’. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు కొత్త తరహా నినాదాన్ని అందుకున్నాయి. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సెలూన్లు వినియోగదారులకు సురక్షితమైన సేవలనందించేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను తలపిస్తున్నాయి. పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లలో పనిచేసే హెయిర్‌స్టైలిస్ట్‌లు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లతో పాటు మాస్కులు, గ్లౌస్లు విధిగా ధరిస్తున్నారు. చాలా చోట్ల సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్లనే వినియోగిస్తున్నారు. కత్తెర, దువ్వెన వంటివి వినియోగదారులు సొంతంగా తెచ్చుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. వేడి డెట్టాల్ నీటిలో శుభ్రం చేస్తున్నారు. కస్టమర్ల రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కరిద్దరు కస్టమర్లకు మించి వెయిటింగ్లో ఉండనీయడం లేదు. అన్నిచోట్ల ఫోన్ బుకింగ్‌లు తప్పనిసరయ్యాయి. కేటాయించిన స్లాట్ ప్రకారం సేవలందజేస్తున్నారు. వరుసగా 4 సీట్లు ఉంటే ఒకటి విడిచి మరో సీటులో సేవలు అందిస్తున్నారు. ప్రతి గంటకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నారు. హ్యాండ్‌వాష్ చేసుకున్న తర్వాతే వినియోగదారులను అనుమతిస్తున్నారు. రెస్టారెంట్లలో టేక్ అవే సర్వీసులు.. రెస్టారెంట్లు, హోటళ్లు టేక్ అవే సర్వీసులను అందజేస్తున్నాయి.రెండు రోజులుగా అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో పార్శిళ్లు తీసికెళ్లే వారి సంఖ్య తగ్గింది. మాస్క్, భౌతికదూరం పాటించాలని, వచ్చిన వారు శానిటర్తో చేతులు శుభ్రపరుచుకోవాలని వినియోగదార్లకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓన్లీ టేక్ అవే (పార్శిల్)కి మాత్రమే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్శిల్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితిలో లోపలి లాంజ్‌లో నాలుగు అడుగుల దూరంలో చైర్స్‌ను అమర్చారు. వచ్చిన వారికి ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చి పార్శిల్ వచ్చే వరకు అక్కడ సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఎంట్రన్స్‌లో ఉంచిన థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కోవిడ్ రహిత క్యాబ్ సేవలు.. క్యాబ్‌లు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి. ఉబెర్, ఓలా వంటి సంస్థలు కోవిడ్ వైరస్ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నాయి. బుకింగ్ బుకింగ్‌కూ మధ్య కారును శానిటైజ్ చేయడం తప్పనిసరి చేశారు. క్యాబ్ డ్రైవర్లకు మాస్క్‌లు, గ్లౌజ్‌లతో పాటు శానిటైజేషన్‌ను ఆయా సంస్థలే అందించేలా చర్యలు చేపట్టాయి. గ్రేటర్లో సుమారు 2 లక్షల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్యాబ్స్‌కు గ్రీన్ సిగ్నల్ పడ్డా ఈ రెండు రోజుల్లో 10 శాతం మాత్రమే రోడ్డెక్కాయి. పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలతో కూడిన పరికరాలను సమకూర్చుకుని రోడ్డెక్కాలనే వ్యూహంలో ఉన్నారు. ఉబెర్‌లో ఇద్దరికే అనుమతి.. క్యాబ్ డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు మాస్క్‌లు, శానిటైజేషన్ చేయించుకోవాలనే నిబంధన ఉంది. ప్రతి బుకింగ్ తర్వాత కారు లోపల భాగాన్ని శానిటైజ్ చేయాలని నిర్ణయించాం. అది ఏ మేర సాధ్యమవుతుందో ఆలోచిస్తున్నాం. క్యాబ్‌లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు అనుమతి ఉండగా.. ఊబెర్ క్యాబ్ మాత్రం డ్రైవర్‌తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. – ప్రవీణ్, ఉబెర్ క్యాబ్ చందానగర్ బ్రాంచ్ లీడ్ ఆస్పత్రి తరహా సేవలు.. ఆస్పత్రి తరహాలో సెలూన్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో కస్టమర్ బయటికి వెళ్లి మరో కస్టమర్‌ను లోపలికి పిలిచే ముందే షాపును పూర్తిగా శుభ్రపరుస్తున్నాం. పరికరాలు, టవల్స్, సీట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. – శ్రీనివాస్, సెలూన్ నిర్వాహకుడు ఈ పద్ధతులు ఎప్పటికీ పాటించాలి హెయిర్ కటింగ్ దుకాణాల్లో అమలు చేస్తున్న శానిటరీ పద్ధతులు బాగున్నాయి. కరోనా మాత్రమే కాదు ఎటువంటి అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఈ పద్ధతులు ఎంతగానో దోహదం చేస్తాయి. అన్ని రోజుల్లోనూ ఇటువంటివి అమలు చేయడం అందరికీ మంచిది. – వెంకటేశ్, వినియోగదారుడు శానిటైజేషన్ తప్పనిసరి.. కోవిడ్– 19 నేపథ్యంలో అటు క్యాబ్ డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు సురక్షితమైన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. క్యాబ్‌లపై విశ్వాసం కలిగేలా కారు లోపలి భాగంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలనే ఆలోచనలోనే యాజమాన్యం కూడా భావిస్తోంది. ఆ దిశగా క్యాబ్ డ్రైవర్లను కూడా సిద్ధం చేసే పనిలో ఉంది.– గోపీ, ఓలా క్యాబ్ ప్రతినిధి -
జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. ఒక పరీక్ష నిర్వహించిన తర్వాత మరో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలంది. పరీక్ష నిర్వహించిన తర్వాత పరీక్ష కేంద్రాలను, భవనాలను క్రిమి సంహారకాలతో శుభ్రం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను, పరీక్షలు నిర్వహించే స్థితిలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను పెద్ద ప్రాంగణాలున్న పాఠశాలలకు, కాలేజీలకు తరలించాలని సూచించింది. పరీక్ష కేంద్రం మార్పు గురించి విద్యార్థులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల వద్ద తగినన్ని కిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చింది. విద్యార్థుల వైద్య అవసరాలను చూసేం దుకు తగిన సంఖ్యలో వైద్య సిబ్బం దిని అందుబాటులో ఉంచా లని పేర్కొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. జూన్ 3 నాటికి రాష్ట్రంలోకరోనా తీరుపై సమీక్ష జరపాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అప్పటి పరిస్థితుల ఆధారంగా పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం అనుకుంటే, ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. జూన్ 8 నుంచి పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయిస్తే, ఆ విషయాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యార్థులకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాని చెప్పింది. తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కతనిశ్చయంతో ఉన్నాం.. ప్రస్తుతం 5.34 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. పరీక్షల వాయిదా వల్ల విద్యార్థుల్లో ఆందోళన, భయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం లాక్డౌన్ పరిమితులను సడలించిందని, దీంతో పరిమిత రాకపోకలకు ఆస్కారం ఏర్పడిందని వివరించారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి గతంలో 200 నుంచి 240 మంది విద్యార్థులను కేటాయించగా, ఇప్పుడు గరిష్టంగా 120కి పరిమితం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈ నేపథ్యంలో 2,005 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాలు 2,530 నుంచి 4,535 కేంద్రాలకు పెరిగాయని వివరించారు. ఇన్విజిలేటర్ల సంఖ్యను కూడా పెంచామని, ఒక్కో ఇన్విజిలేటర్ 10 నుంచి 12 మంది విద్యార్థులను మాత్రమే పర్యవేక్షిస్తారన్నారు. 26,422 మంది అదనపు సిబ్బంది సేవలను వాడుకుంటామని స్పష్టం చేశారు. వారికి ప్రత్యేక గదులు.. పరీక్ష కేంద్రాల వద్ద పాటించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కచ్చితంగా అమలు చేస్తామని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. విద్యార్థుల కోసం బస్సులు ఏర్పాటు చేస్తామని, బస్సుల్లో కూడా భౌతిక దూరం పాటించేలా చూస్తామని చెప్పారు. కేంద్రం వద్దకు విద్యార్థితో పాటు ఓ సహాయకుడిని మాత్రమే అనుమతిస్తామని, పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు హాల్‌టికెట్‌ను ప్రయాణ పాస్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుందన్నారు. హాలులోకి వెళ్లేటప్పుడు, పరీక్ష సమయంలో, బయటకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. విద్యార్థులకు ధర్మల్ పరీక్షలు చేసి, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని ప్రత్యేక గదుల్లో కూర్చోబెడతామని చెప్పారు. గదుల వద్ద శానిటైజర్లు, మరుగుదొడ్ల వద్ద సబ్బులు, శానిటైజర్లును అందుబాటులో ఉంచుతామని వివరించారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడే టీచర్లు, ఇతర సిబ్బందిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. పిల్లల భవిష్యత్తు ముఖ్యం.. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరు పవన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ఏపీలో మాదిరిగా పరీక్ష పేపర్ల సంఖ్యను తగ్గించాలని, తెలంగాణలో 8 పేపర్లను నాలుగు చేయాలని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈనెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించినా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సబబు కాదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ అంతటా గ్రీన్‌జోన్‌గా సీఎం ప్రకటించారని, పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచన చేయాలి కదా అని వ్యాఖ్యానించింది. కరోనా ఇప్పట్లో అంతమవుతుందని ఎవరైనా చెబుతున్నారా, మందు కూడా లేదనే విషయాన్ని గుర్తించాలని, కరోనా సమస్య కొలిక్కి వచ్చేలా లేదని, అందరూ కరోనాతో సహజీవనం చేస్తూనే అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేయాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థుల భవిష్యత్ బాధ్యత మనందరిపైనా ఉందని, వారు కరోనా బారిన పడకుండా రక్షించే విషయంలో ప్రభుత్వం మరింత జాగరుకతతో ఉండాలని పేర్కొంది. 5.34 లక్షల మంది పదో తరగతి విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసుకుంటూ పోతే వారి మెడపై కత్తి వేలాడుతున్నంత టెన్షన్ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పరీక్షలకు అనుమతి ఇవ్వకపోతే విద్యా సంవత్సరం నష్టపోతారని చెప్పింది. అందుకే ప్రభుత్వం వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని షరతులు విధిస్తూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది. కంటైన్మెంట్, రెడ్ జోన్లలోని విద్యార్థులను సురక్షితంగా పరీక్ష కేంద్రాలకు తరలించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశించింది. -
మందు బంద్.. 50మంది మాత్రమే
బెంగళూరు: పెళ్లి అంటే ఒకప్పుడు బంధువుల హడావుడి.. డీజే సందడి, మందు-విందు కనిపించేవి. కానీ కరోనా దెబ్బతో ఇలాంటి వేడుకల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ఇలాంటి వేడుకల మీద అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాల్లో మందుకు అనుమతిలేదని.. 50 మందికి మించి ఈ వేడుకలకు హాజరు కాకుడదని తెలియజేసింది. ఈ నెల 17న దేశవ్యాప్తంగా మూడో దశ లాక్డౌన్ ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. (మాస్క్ ధరించడం ‘బలహీనతకు సంకేతం’! ) పెళ్లి, ఇతర ప్రైవేట్ ఫంక్షన్లకు 50మందికి మించి అనుమతి లేదని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అలానే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి అంది. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారిని ఈ వేడుకలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వేడుకకు హాజరయ్యే వారి పూర్తి వివరాలను సేకరించాలని సూచించింది. అంతేకాక వేడుక జరిగే చోట శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించింది. మరి ముఖ్యంగా ఈ వేడుకల్లో మద్యపానానికి ఎట్టి పరిస్థితుల్లోను అనమతిచ్చేది లేదని కర్ణటక హోం శాఖ తెలిపింది. అలానే కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు ఈ వేడుకలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకాకుడదని పేర్కొంది.(లాక్డౌన్: ముంబై నుంచి బిహార్‌కు ఆటోలో) -
ఉండలేక.. ఊరెళ్లలేక..
సాక్షి, ఆదిలాబాద్ : పొట్టచేత పట్టుకొని.. రాష్ట్ర సరిహద్దులు దాటి జిల్లాకు వచ్చిన వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించింది. దీంతో లాక్డౌన్ నిబంధనలను కొంత మేరకు సడలించింది. నెల రోజులకుపైగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు కూలీలను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయగా, తమ తమ రాష్ట్రాలకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. దీంతో శని, ఆదివారాల్లో బయలుదేరాలి్సన బస్సులు ఇక్కడే నిలిచిపోయాయి. కరోనా దేశ వ్యాప్తంగా ఉన్న దృష్ట్యా ఆయా రాష్ట్రాల నోడల్ అధికారులను సంప్రదించకుండా కూలీలను తీసుకెళ్లడం సరికాదు. అయితే సహాయ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆయా రాష్ట్రాల నోడల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడి నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఇక్కడ ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక.. అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 6,612 మంది.. వివిధ పనుల నిమిత్తం జిల్లాకు వచ్చిన వలస కూలీలు 6,612 మంది ఉన్నారని యంత్రాంగం గుర్తించింది. కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలు కాలేదు. అయితే జిల్లాలోని వలస కూలీలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఫంక్షన్ హాళ్లలో, వసతి ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. ఇక స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో ఇంటిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు కూడా కూలీల జాబితా తయారు చేస్తోంది. రాష్ట్రాల వారీగా తరలించేందుకు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో కుటీర పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు, ఇటుక బట్టీలు, జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసేందుకు వచ్చిన వలస కార్మికులే అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో సగానికి పైగా సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుండగా, సోమ లేదా మంగళవారాల్లో వారిని తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని రకాలుగా సాయం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హైదరాబాద్‌కు చెందిన వలస కూలీలు జిల్లాలో అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్‌లోని గాయత్రి గార్డెన్, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో షెల్టర్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను ఉంచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర సరుకులు అందజేసి, భోజన వసతి కల్పిస్తున్నారు. వచ్చినా.. వెళ్లినా థర్మల్ స్క్రీనింగ్ తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలకు అంతరాష్ట్ర సరిహద్దు వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్, మెడికల్, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని, మన రాష్ట్రం మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి జైనథ్ మండలం డొలారా గ్రామం పెన్‌గంగా వద్ద అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు. వచ్చిన వారి వివరాలు నమోదు చేసి, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండే విధంగా స్టాంపింగ్ చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. పెన్‌గంగా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కలెక్టర్ ఆదివారం +పరిశీలించి, నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. -
థర్మల్ స్క్రీనింగ్: హమాలీలకు అనుమతి
సాక్షి, నిజామాబాద్: ధాన్యం కొనుగోళ్ల లో తలెత్తిన హమాలీల సమస్యను అధిగమించడం అధికార యంత్రాంగానికి సంక్లిష్టంగా మారింది. మహారాష్ట్ర, బీహార్ నుంచి వచ్చే ఈ వలస కూలీలను జిల్లాలోనికి అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన ప రిస్థితి నెలకొంది. ప్రతి సీజనులో వందల సంఖ్యలో వచ్చే వీరిని ఇప్పుడు జిల్లాలోకి అనుమతిస్తే కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. పైగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి వచ్చే హమాలీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ విస్తరించే అవకాశాలుంటాయి. మరోవైపు అవసరమైన మేరకు హమాలీలు లేక జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆశించిన మేరకు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ హమాలీలను అనుమతించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే జిల్లాలోకి అనుమతించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశించారు. రైసుమిల్లులోనూ ఇదే పరిస్థితి.. ప్రతి సీజనులో మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి హమాలీలు వందల సంఖ్యలో జిల్లాకు వస్తుంటారు. ధాన్యం బస్తాల్లో నింపడం.. తూకం.. లోడింగ్.. అన్లోడింగ్ వంటి పనులు చేస్తుంటారు. ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద కనీసం 12 మంది హమాలీలు ఉంటారు. ఎక్కువ మొత్తంలో ధాన్యం వచ్చే కేంద్రాల్లో 20 మంది వరకు పనిచేస్తుంటారు. గ్రూపులు.. గ్రూపులుగా వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేస్తుంటారు. ఇలా జిల్లాలో ఏర్పాటు చేయనున్న 250 పైగా కొనుగోలు కేంద్రాల్లో సుమారు రెండు వేలకు పైగా హమాలీలు వస్తుంటారు. అలాగే రైసుమిల్లుల్లోనూ హమాలీల అవసరం ఉంటుంది. ఒక్కో మిల్లులో సుమారు 25 నుంచి 40 మంది పనిచేస్తుంటారు. సీజను ముగిసేదాక ఇక్కడే ఉండి సీజను ముగిసాక సొంత గ్రామాలకు వెళ్లిపోతుంటారు. ఈసారి లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన హమాలీలు జిల్లాకు చాలా మట్టుకు రాలేకపోయారు. ఇప్పుడు వీరిని జిల్లాకు తీసుకురావాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రతి వ్యక్తికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే జిల్లాలోకి అనుమతించాలని భావిస్తోంది. మందకోడిగా కొనుగోళ్లు.. హమాలీల సమస్య కారణంగా కేంద్రాల వద్ద తూకాలు ఆలస్యమవుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు, ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులే స్థానికంగా ఉండే కూలీలతో లోడింగ్.. కాంటా పనులు చేయిస్తున్నారు. వీరికి సరైనా అనుభవం లేకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం జరుగుతోంది. -
డ్రోన్లతో థర్మల్ స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణలో భాగంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వినూత్న సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా రైతు బజార్లు వంటి బహిరంగ మార్కెట్లలో డ్రోన్లతో థర్మల్ స్క్రీనింగ్ (శరీర ఉష్ణోగ్రత చూడటం) చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు వంటి వాటిలోకి ఒక్కొక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలంటే చాలా కష్టమైన పనికావడంతో ఇందుకోసం డ్రోన్లను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఈవో ఆళ్ల రవీంద్రరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. డ్రోన్‌కు థర్మల్ స్క్రీనింగ్ పరికరాన్ని అమర్చి జనం కొనుగోళ్లు చేసుకుంటుండగానే శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాం. ప్రస్తుతం దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద పరిశీలిస్తున్నాం.. విజయవంతమైతే రాష్ట్రమంతా అమల్లోకి తెస్తాం. రెడ్ జోన్లలో జన సంచారాన్ని అనుమతించే అవకాశం లేకపోవడంతో వారికి సూచనలు, సలహాలిచ్చేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నాం. ఇప్పటికే నెల్లూరులో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ వినియోగిస్తాం. -
ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్కానింగ్..
సాక్షి, విశాఖపట్నం: రైల్వే స్టేషన్‌కు వచ్చి, బయటకు వెళ్లే ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్కానర్ ద్వారా తనిఖీ చేస్తున్నామని విశాఖ రైల్వే ష్టేషన్ చీఫ్ మేనేజర్ సురేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్-19( కరోనా వైరస్) నిరోధానికి విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైల్వేస్టేషన్ ప్రధాన గేటు1, వెనుక వైపు జ్ఞానాపురం గేటు ను మాత్రమే తెరిచి ఉంచామని తెలిపారు. (రేపు జనతా కర్ఫ్యూ పాటిద్దాం: గౌతం సవాంగ్) ప్రయాణికుల తనిఖీకి నాలుగు ధర్మల్ స్కానర్లను అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులను పరీక్షించడానికి నలుగురు చొప్పున పది బృందాలను మూడు షిఫ్ట్‌ల్లో ఉంచామని చెప్పారు. ప్రతీ బృందంలో ఆర్పీఎఫ్ పోలీసులు, సివిల్, డిఫెన్స్, టిక్కెట్ కలెక్టర్లను ఏర్పటు చేశామన్నారు. (రైళ్లలో కరోనా రోగులుంటారు జాగ్రత్త : ప్రయాణం ప్రమాదం) రేపటి ‘జనతా కర్ఫ్యూ’ నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి, రత్నాచల్, గోదావరి, విశాఖ, ఎల్టీటీ రైళ్లను రద్దు చేశామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగే 50 వరకు రైళ్లు రద్దు అయ్యాయని తెలిపారు. రేపు ప్రజలంతా స్వచ్ఛందంగా ‘కర్ఫ్యూ ’ పాటించి కరోనాని నియంత్రించాలని సురేష్ పిలుపునిచ్చారు. (కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్!) -
విమానం దిగగానే క్వారంటైన్కే..
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. గత రెండ్రోజులుగా 1,160 మందిని ధూలపల్లి, వికారాబాద్, గచ్చిబౌలి స్టేడియం, ఎంసీఆర్హెచ్ఆర్డీ, రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ, నారాయణమ్మ కాలేజీ, అమీర్‌పేట నేచర్ క్యూర్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక పడక గదులు సిద్ధం చేశామన్నారు. విమానాశ్రయంలో దిగగానే వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని స్లిప్పులను అందజేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి వెళ్లకుండా ఒక్కో కేంద్రానికి ఒక ఏసీపీని ఇన్చార్జ్గా నియమించినట్లు తెలిపారు. కాగా దూలపల్లి ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఒక్కో గదిని ఇద్దరికి కేటాయించారని, బాత్రూంలు ఇలా చాలా చోట్ల పరిశుభ్రత లేదని పలువురు ఎన్ఆర్ఐలు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం 6 అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు దేశీయంగా 30 విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వస్తున్నవారు విమానం దిగాక థర్మల్ స్క్రీనింగ్‌కు దొరక్కుండా ఉండేందుకు జ్వరానికి ఉపయోగించే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. విమానం దిగేందుకు గంట ముందు ఈ మాత్రలు వేసుకుంటున్నారు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి స్క్రీనింగ్‌లో దొరక్కుండా ఇదో ఉపాయాన్ని వెతుక్కుంటున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న వారిని ‘సీ’కేటగిరీ కింద భావించి నేరుగా ఇళ్లకు పంపుతారు. ఇంటి దగ్గరే ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. (తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు) జ్వరం ఉంటే ఎక్కడ గాంధీ ఆస్పత్రి లేదా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందోననే భయంతో మరోదారిలో బయటపడుతున్నారు. ఈ విషయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసింది. ఇలాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండ్రోజుల కిందట ఇలాగే దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి పారాసిటమాల్ వేసుకొని, థర్మల్ స్క్రీనింగ్‌కు దొరక్కుండా నేరుగా ఇంటికే వెళ్లాడు. దీనిపై ఒకరు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. (కరోనా.. కోటి రూపాయల నజరానా) యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండంతో విమానాశ్రయాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు, పార్లమెంట్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కోవిడ్-19 అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. (కరోనా: తెర వెనుక హీరోపై ప్రశంసలు)