ఉరవకొండ: ప్రజా సవుస్యలను గాలికొదిలి పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వుధు అన్నారు. స్థానిక క్లాక్‌టవర్ వద్ద రెండు రోజులు నిర్వహించే సీసీఎం జిల్లా ప్లీనరీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఆర్టీసీ డిపో నుంచి పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సవూవేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వుధు, కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి మాట్లాడారు. జిల్లాకు ప్రధానమైన హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
కేవలం ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి నీటిని కుప్పంకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నాడన్నారు. కాలువ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి అరుుతే ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలకు, జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయించడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి రాంభూపాల్ వూట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన రెండేళ్లలో 165 వుంది రైతులు, 42 వుంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
ఈ పాపం చంద్రబాబుదేనన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీపీఎం రాయులసీమ కార్యదర్శి ఓబులు వూట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో దౌర్జన్యకాండ అధికమైందన్నారు. సవూవేశాల్లో వూజీ ఎమ్మెల్యే గఫూర్, జిల్లా నాయుకులు నల్లప్ప, కొండారెడ్డి, పోలా రావూంజినేయుులు, ప్రసన్న పాల్గొన్నారు.
‘ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడింది’
Published Tue, Mar 29 2016 3:25 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement
Advertisement