వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ముగ్గురు సెక్యూరిటీ గార్డులు గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు.
ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ముగ్గురు సెక్యూరిటీ గార్డులు గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. జనవరి నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన వెంకటేశ్, పవన్, చంద్ర మోహన్ అనే సెక్యూరిటీ గార్డులు పురుగుల మందు తాగారు.
వెంటనే తేరుకున్న స్థానికులు బాధితులను ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.