కావలి: సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లఘించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు ఎలా తీసుకుంటారని అలేఖ్యకు, ఆమెను ఆ పదవిలో ఎలా ఉండనిచ్చారని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్‌కు సోమవారం కోర్టు ధిక్కారణ నోటీసులను జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ నుంచి 13 వార్డు కౌన్సిలర్‌గా పి.అలేఖ్య, 3వ వార్డు నుంచి పోటీచేసిన తోట వెంకటేశ్వరావులు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విప్‌ను ధిక్కరించి టీడీపీలో చేరారు.
మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అలేఖ్య ఎన్నికయ్యారు. దీనిపై వైఎస్సార్‌సీపీ వర్గీయులు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు పిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్వర్వుల మేరకు అలేఖ్య, తోట వెంకటేశ్వరావులపై ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ అనర్హత వేటు వేశారు. ఆ ఉత్వర్వులపై అలేఖ్య, తోట వెంకటేశ్వర్లు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఆస్టేను డిసెంబర్‌లో హైకోర్టు ఫుల్ బెంచ్ నిలుపదల చేసి అనర్హత వేటును కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే దీనికి సంబంధించి మరలా నోటీసులు జారీ చేసి విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని కావలి ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు ఉత్వర్వులిచ్చింది. తర్వాత అలేఖ్య, తోట వెంకటేశ్వరావులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరిలో దీనికి సంబంధించి అనర్హత వేటుపై మరలా విచారణను చేపట్టాలన్న ఆర్డీఓ ఉత్తర్వులపై మాత్రమే స్టేను విధిస్తూ సుప్రీం కోర్టు ఉత్వర్వులు ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. కానీ జనవరి 26న మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అలేఖ్య బాధ్యతలు స్వీకరించారు.
ఆసమయంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ కూడా అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యలో కోర్టు ఉత్తర్వులను ఉల్లఘించారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఉత్తర్వులను ధిక్కారిస్తూ బాధ్యతలు ఎలా స్వీకరించారు..? దానిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను జారీ చేసిందని వైఎస్సార్‌సీపీ సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాత్రం సుప్రీం ఉత్వర్వులపై న్యాయ సలహాను తీసుకున్నామని చెబుతున్నారు.
కోర్టు ధిక్కారంపై అలేఖ్య, కమిషనర్‌కు నోటీసులు
Published Tue, Feb 10 2015 5:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement