కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: కానిస్టేబుల్ నుంచి వీఆర్‌ఏ, వీఆర్‌వో, పంచాయతీరాజ్ సెక్రటరీ, బ్యాంక్ క్లర్క్.. పోస్టు ఏదైనా పోటీ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శిక్షణ పొందితే గానీ పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కర్నూలు, నంద్యాలలలోని కోచింగ్ సెంటర్లు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ రాతపరీక్ష ఫిబ్రవరి రెండో తేదీన జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
శుక్రవారం సాయంత్రం నాటికి దాదాపు 58వేల మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 105 వీఆర్‌వో పోస్టులకు గాను 554వేల మంది దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వ ఉద్యోగాలపై నిరుద్యోగులకు ఉన్న మక్కువ ఏపాటిదో తెలిసిపోతోంది. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య 60వేలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మీ-సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించేందుకు ఈనెల 12వ తేదీ చివరి రోజు కాగా 13వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ అర్హత ఉన్న ఈ పోస్టులకు అంతకుమించి అర్హత ఉన్న పలువురు అభ్యర్థుల మనోభావాలను ‘న్యూస్‌లైన్’ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
సర్కారు కొలువే లక్ష్యం
Published Sat, Jan 11 2014 3:04 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement