ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా
మైదుకూరు టౌన్ న్యూస్‌లైన్ : ముస్లింల సం క్షేమానికి కృషి చేస్తానని మైదుకూరు ఎమ్మె ల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని షాదీఖానాలో సోమవారం ముస్లిం వెల్‌ఫేర్ సొసైటీ అధ్వర్యంలో ముస్లిం పిల్లలకు ప్రతి సంవత్సరం వేసవిలో జరిపే ఖత్నా(ఒడుగుల) కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబాలకు చెందిన పిల్లలు 70 మందికి మదనపల్లె డాక్టర్ జిఎస్‌మస్తాన్ బాషా ఒడుగుల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవలతోపాటు పేద ముస్లిం పిల్లలకు విద్యను అభ్యసించుటకు చేయూతనివ్వాలని కోరారు. గతంలో ముస్లిం ల కోసం ఉర్దూ మహిళా పాఠశాల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. ఈ సారి ముస్లిం పిల్లలకోసం తగిన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమానికి ముస్లిం వెల్‌ఫేర్ యూనియన్ ప్రెసిడెంట్ మదీనా దస్తగిరి,సెక్రటరి అబ్దుల్లా, ఉపాధ్యక్షులు పాలమాబూ, యాకోబ్,మబూహుసేన్,గౌస్ ఖాదర్‌వలి,షరీఫ్, అమీర్ బాషా పాల్గొన్నారు.