Muslim Welfare Society
-
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, అమరావతి: వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆ బిల్లుపై ముస్లిం మైనార్టీలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారని భరోసా ఇచ్చారు. పార్లమెంటు సంయుక్త కమిటీ(జేపీసీ)లో సభ్యుడుగా ఉన్న తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని ముస్లింల అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని వారికి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్సార్సీపీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై వైఎస్సార్సీపీ తొలి నుంచి అండగా నిలిచిందని.. వారి వెంట నడుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.మొత్తం వ్యవస్థను కొత్త వక్ఫ్ బిల్లు నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడం వల్లే.. కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తుచేశారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అనేక చర్యలు తీసుకున్నామని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపర్చడం ఒక గొప్ప పరిణామమన్నారు. ముస్లింలకు వైఎస్ జగన్ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో 60ను వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ముస్లింల సంక్షేమంలో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ముస్లిం సమాజానికి మేలు చేసిన గొప్ప నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా కితాబిచ్చారు. మంగళవారం జరిగిన శాసన మండలి క్వశ్చన్ అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లింల సంక్షేమానికి రూ. 2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, సీఎం జగన్ నాయకత్వంలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 12,366 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు లెక్కలతో సహా వివరించారు. గత ప్రభుత్వం హయాంలో ఉర్దూ అకాడమీ నిర్వహణలో రూ. 14 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సీఐడీ విచారణ కూడా జరిగిందన్నారు. ఉర్దూ అకాడమీకి చెందిన 36 కంప్యూటర్ కేంద్రాలను పునరుద్ధరించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో మైనారిటీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని అంజద్‌బాషా వెల్లడించారు. వర్సిటీ ఖాళీలు త్వరలో భర్తీ: మంత్రి బొత్స విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ఖాళీల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 2019–20 నుంచి 2022–23 వరకు 1,54,50,580 మంది విద్యార్థులు లబ్ధి పొందారని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 6,262.29 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విద్యార్థులకు వారానికి 16 రకాల పదార్థాలను అందిస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా యంత్రసేవా పథకం: మంత్రి కాకాణి వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా వైఎస్సార్ యంత్రా సేవా పథకాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా రైతులకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. కౌలు రైతులను కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని, కౌలుదారులకు కార్డులు జారీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ (స్పెషల్‌డ్రైవ్) చేపడతామన్నారు. ప్రతి రూపాయీ సది్వనియోగం: మంత్రి అంబటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం జరగడంలేదనే అపోహ వద్దన్నారు. ప్రతి రూపాయిని ఈ ప్రభుత్వం బాధ్యతయుతంగా సద్వినియోగం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందన్నారు. పోలవరం నిర్మాణం జాప్యానికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి కాఫర్ డ్యామ్ పనులు అసంపూర్తిగా చేయడం వల్లే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం వేసిన అంచనాలు మరింత పెరిగాయని, సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదంతో పనులు వేగవంతం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. మండలిలో సభ్యులు వరుదు కళ్యాణి, మొండితోక అరుణ్‌కుమార్, మర్రి రాజశేఖర్, రఘురాజు, కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ షాబ్జీ, అనంత సత్యఉదయభాస్కర్ పలు అంశాలను ప్రస్తావించారు. కాగా, అసెంబ్లీలో ఆమోదం పొందిన 11 బిల్లులను మండలిలో సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టడంతో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. -
రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయం ప్రారంభం
మంగళగిరి: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, అంజాద్ బాషా బుధవారం ప్రారంభించారు. అనంతరం కమిషన్ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో మైనార్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. కమిషన్ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపైనా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ సహకారంతో త్వరలోనే పక్కా భవన నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, అంబటి రాంబాబు, కిలారి రోశయ్య, మద్దాలి గిరిధర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు భీమనాథం భరత్‌రెడ్డి, కమిషన్ సెక్రటరీ మహ్మద్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా
మైదుకూరు టౌన్ న్యూస్‌లైన్ : ముస్లింల సం క్షేమానికి కృషి చేస్తానని మైదుకూరు ఎమ్మె ల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని షాదీఖానాలో సోమవారం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో ముస్లిం పిల్లలకు ప్రతి సంవత్సరం వేసవిలో జరిపే ఖత్నా(ఒడుగుల) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబాలకు చెందిన పిల్లలు 70 మందికి మదనపల్లె డాక్టర్ జిఎస్‌మస్తాన్ బాషా ఒడుగుల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవలతోపాటు పేద ముస్లిం పిల్లలకు విద్యను అభ్యసించుటకు చేయూతనివ్వాలని కోరారు. గతంలో ముస్లిం ల కోసం ఉర్దూ మహిళా పాఠశాల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. ఈ సారి ముస్లిం పిల్లలకోసం తగిన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమానికి ముస్లిం వెల్ఫేర్ యూనియన్ ప్రెసిడెంట్ మదీనా దస్తగిరి,సెక్రటరి అబ్దుల్లా, ఉపాధ్యక్షులు పాలమాబూ, యాకోబ్,మబూహుసేన్,గౌస్ ఖాదర్‌వలి,షరీఫ్, అమీర్ బాషా పాల్గొన్నారు.