కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తదితరులు
మంగళగిరి: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, అంజాద్ బాషా బుధవారం ప్రారంభించారు. అనంతరం కమిషన్ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో మైనార్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.
కమిషన్ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపైనా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ సహకారంతో త్వరలోనే పక్కా భవన నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, అంబటి రాంబాబు, కిలారి రోశయ్య, మద్దాలి గిరిధర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు భీమనాథం భరత్‌రెడ్డి, కమిషన్ సెక్రటరీ మహ్మద్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment