మోగనున్న పెళ్లిబాజా | Today From starts Maga masam | Sakshi
Sakshi News home page

మోగనున్న పెళ్లిబాజా

Published Tue, Feb 9 2016 3:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

మోగనున్న పెళ్లిబాజా

మోగనున్న పెళ్లిబాజా

* నేటి నుంచి మాఘమాసం ప్రారంభం
* రేపటి నుంచి వివాహ ముహూర్తాలు

పిఠాపురం : గోదావరి పుష్కరాల కారణంగా ఆరు నెలలకు పైగా మూగబోయిన పెళ్లిబాజాలు ఇకనుంచి మోగనున్నాయి. పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే మాఘమాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో వివాహాలు కూడా మొదలు కానున్నాయి. బుధవారం నుంచే ముహూర్తాలు కూడా ఆరంభమవుతున్నాయి. దీంతో ఆరు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న కల్యాణ మండపాలు బాజాభజంత్రీలతో వివాహ మంత్రాల ఘోషతో మార్మోగనున్నాయి. బంధుమిత్రుల సందళ్లతో కళకళలాడనున్నాయి.

నిశ్చితార్థాలు, వివాహాలతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనల వంటి శుభకార్యాలకు కూడా పలువురు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పేరొందిన కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. పురోహితులు, షామియానాలు, మైక్, లైటింగ్, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, కేటరర్‌‌స బిజీగా మారిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement