అక్రమ అరెస్టులకు నిరసనగా అనంతలో బంద్ | Today, YSRCP calls strike in Anantapur | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్టులకు నిరసనగా అనంతలో బంద్

Published Mon, May 4 2015 9:21 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

Today, YSRCP calls strike in Anantapur

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు సోమవారం అనంతపురం నగరంలో బంద్కు పిలుపు నిచ్చారు.  వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. వైఎస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని విశ్వేశ్వర రెడ్డి, శంకర్ నారాయణలు ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడటంలో చంద్రబాబు విఫలమయ్యారని, వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీలో కీలకంగా పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడుల చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణలు ఆరో్పించారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఆ పార్టీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రసాద్ రెడ్డి హత్య కేసును పక్కనపెట్టి, తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement