నెరవేరని లక్ష్యం | Toilet construction scheme is going too slowly | Sakshi
Sakshi News home page

నెరవేరని లక్ష్యం

Published Sat, Mar 1 2014 2:36 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

Toilet construction scheme is going too slowly

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం ఉద్యమం మాదిరిగా చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం(ఐహెచ్‌హెచ్‌ఎల్) జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. బహిరంగ మలవిసర్జన అనారోగ్యదాయకమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నాయి. వీటి బాధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. ప్రధానంగా పల్లెజనంలో మరుగుదొడ్లు నిర్మించాలనే అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫల మైంది. వీఆర్‌ఏ స్థాయి నుంచి జిల్లాస్థాయి ఉన్నతాధికారి వరకు  ఇందులో భాగస్వాములుగా ఉన్న లక్ష్యం నెరవేరడంలేదు.

 పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు..
 పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు, కూలీ చార్జీలు నిరుపేదలకు భారంగా మారాయి. వ్యక్తిగత మరుగుదొడ్డికి చెల్లిస్తున్న ప్రభుత్వ వాటా రూ.9,100 నుంచి రూ.10 వేలకు పెంచిన లబ్ధిదారులకు ఊరట లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) వాటా రూ.5,400, నిర్మల్ భారత్ అభియాన్ వాటా రూ.4,600, లబ్ధిదారుడి వాటా రూ.900 ఉన్నాయి. మొత్తం 10,900 డబ్బులతో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారులు సొంతంగా డబ్బు ఖర్చు చేసి మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. లబ్ధిదారుడు తన సొంత ఖర్చుతో మరుగుదొడ్డి నిర్మించుకుంటే వారం రోజుల్లో పూర్తవుతుంది. అయితే నెల రోజుల్లో సంబంధిత లబ్ధిదారుడికి బిల్లు చెల్లించాలి. ఇది గ్రామాల్లో సక్రమంగా అమలుకావడం లేదు. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా పథకం అమలు నత్తనడకన కొనసాగుతోంది.

 జిల్లాలో పరిస్థితి
 ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్‌కు 33,609మరుగుదొడ్లు మంజూరయ్యాయి.ఇందులో 5,899పూర్తికాగా, 5,064 నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి ప్రారంభం కాలేదు.
 నిర్మల్ డివిజన్‌కు 28,702 మంజూరు కాగా, 5,131 నిర్మాణాలు పూర్తయ్యాయి. 3,741మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి ప్రారంభం కావాల్సి ఉంది.
 ఆసిఫాబాద్ డివిజన్‌కు 37,331 మంజూరుకాగా, 3,921 పూర్తయ్యాయి. 7,861 నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి ప్రారంభం కాలేదు.
 మంచిర్యాలకు 29,772 మంజూరు కాగా, 5,039 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. 4,593 నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి ప్రారంభించలేదు.
 ఉట్నూర్‌కు 28,482 మంజూరుకాగా, 3,570 మరుగుదొడ్లు పూర్తికాగా, 3,731 నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి ప్రారంభించ లేదు.
 ఎదురవుతున్న ఇబ్బందులు..
 ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న వారికి మంజూరు చేస్తున్నారు. బ్యాంకు ఖాతా తప్పని సరిగా ఉండాలి. జాబ్‌కార్డులేని వారికి జాబ్‌కార్డు ఇస్తూ మంజూరు చేయడంలో ఆలస్యం జరుగుతోంది.
జాబ్‌కార్డులో ఎంత మంది పనిచేసే వారుంటారో అంత తొందరగా మరుగుదొడ్డి నిర్మాణాలు పూర్తవుతాయి. జాబ్‌కార్డులో భార్యభర్తలిద్దరి పేర్లు, పిల్లలు పేర్లు ఉండడంతో ఆలస్యం అవుతోంది.
 జాబ్‌కార్డులో పేర్లు ఉండి ఉపాధి పనులు చేసే వారిని మాత్రమే పేమెంట్ చేసే మాస్టర్ షీట్‌లో నమోదు చేస్తారు. పిల్లల పేర్లు ఉండడం వల్ల నమోదు చేయరాదని అధికారులు చెబుతున్నారు. 15 ఏళ్లకుపైబడి ఉన్న పిల్లలను పని చేయదలచిన వాళ్లుగా గుర్తిస్తారు.
సొంత డబ్బులతో మరుగుదొడ్డి కట్టుకున్న వారికి బిల్లులు సరిగా అందడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో కొంత మంది ఖర్చు లేకుండా మంజూరైనప్పుడే కట్టుకుంటామనే ధోరణిలో ఉన్నారు. దీంతో నిర్మాణాలు వెనుకబాటు పడుతున్నాయి.
 {V>Ò$× ప్రాంతాలకు సరిపడా మెటీరియల్ సరఫరా కావడం లేదు. దీంతో నిర్మాణాలు పూర్తి కావడం లేదు. నిర్మాణాలు పూర్తికాగా, ఈజీఎస్ సిబ్బంది బిల్లులు ఇవ్వడం లేదు. పూర్తయిన వాటికి బిల్లులు చెల్లిస్తేనే మరిన్ని మరుగుదొడ్లకు మెటీరియల్ సరఫరా చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement