సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్
సాక్షి, వేంపల్లె/జమ్మలమడుగు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, హెలీప్యాడ్‌ను గండి ఆలయ ప్రాంగణాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, సమాధికి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారన్నారు. పులివెందుల డాక్టర్ వైఎస్సార్ ఆర్టికల్చర్ యూనివర్శిటీకి అనుబంధంగా అరటి రీసెర్చ్ స్టేషన్‌కు గండిలో శంకుస్థాపన చేస్తారన్నారు.
జమ్మలమడుగులో జరిగే సభా వేదికగా రైతులకు మద్దతు ధర, వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించనున్నారన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన నేపథ్యంలో క్వింటా శనగలకు రూ.6,500, వైఎస్సార్ పెన్షన్‌ను రూ.2250లు అందజేస్తారని తెలిపారు. జమ్మలమడుగులో రైతులకు శనగకు మద్దతు ధర రూ.6,500 చెక్కులను అందజేస్తారని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతు తదితర పెరిగిన పింఛన్లు అందజేస్తారన్నారు. పర్యటనకు సంబంధించి మా ర్పులు, చేర్పులపై విధి విధానాలు సీఎం కార్యాల యం నుంచి రావాల్సి ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ బెల్లం ప్రవీణ్ కుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, మండల బూత్ కమిటీ మేనేజర్ ఆర్.శ్రీను, మాజీ సర్పంచ్ సురేష్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శంకరయ్యలతో పాటు కడప ఆర్డీఓ మలోల, పీఆర్ ఈఈ రామలింగారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి తండ్రి బాటలో సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారిగా జిల్లాలో పర్యటించబోతున్నారని డిఫ్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. జమ్మలమడుగులో జగన్ పర్యటన పర్యటన ఏర్పాట్లను డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి..సుధీర్‌రెడ్డి,కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు,తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా డిఫ్యూటీ సీఎం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రైతు పక్షపాతిగా నిలవనున్నారని తెలిపారు. ఇక్కడ జరిగే రైతు సదస్సులో జగన్ మోహన్‌రెడ్డి పాల్గొంటారన్నారు. రైతులకు పలు వరాలు ఇవ్వబోతున్నారన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్ చర్చించి గోదావరి జలాలను కృష్ణనదిలోనికి మళ్లించే బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలిపారు. గోదావరి నదిలో 90 నుంచి 100 రోజుల వరకు వరద నీరు పారుతుంది. 180 టీఎంసీల నుంచి 200 టీఎంసీ నీరు గోదావరి నుంచి కృష్ణానది లోనికి మళ్లించుకుని రాయలసీమలోని దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. నీటిని మళ్లించుకోవడం కోసం దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ అవుతుందని ..ఈ దిశగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారన్నారు.
గోదావరి నుంచి నీటిని కృష్ణానదిలోనికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గతంలో ఆయన తండ్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పనులు చేపట్టి రైతుల భూములకు సాగునీరు అందించి ఆపరభగీరథుడుగా పేరు సంపాదించారు. ఆయన కుమారుడు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీటవేస్తారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి, మల్కిరెడ్డి.హనుమంతరెడ్డి, పోరెడ్డి మహేశ్వరరెడ్డి,గౌస్‌లాజం,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
సభావేదిక పరిశీలన
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు సభా ప్రాంగణాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి, ఎమ్మెల్యే మూలే సుధీర్‌రెడ్డి, డీఎస్పీ కోలా కృష్ణన్ పరిశీలించారు. వేదిక,రూట్ మ్యాపు, హెలిప్యాడ్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది వచ్చే అవకశముందో అంచనా వేశారు. సభావేదిక నిర్వాహణ, గ్యాలరీ, సెక్యూరిటీ గురించి చర్చించారు. సభకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. హనుమంతరెడ్డి, పోరెడ్డిమహేశ్వరరెడ్డి, బ్రçహాæ్మనందరెడ్డి,కులాయ్‌బాషా, విష్ణువర్ధన్‌రెడ్డి, శివగుర్విరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నేతల భేటీ
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, వైఎస్‌ఆర్‌సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె. సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి తదితరులు సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా వస్తున్న జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలన్నారు.
సభా స్థలం వద్ద డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు
8వ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధు్దలు, వితంతువులకు రూ.2250లు పింఛన్ ఇవ్వడం జరుగుతోందన్నారు. సభకు రైతులు ఎక్కువగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభకు ప్రజల తరలింపునకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంపై నేతల విముఖత ప్రదర్శించారు. అవసరమైతే ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, కార్యకర్తలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా తాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment