అయితే మాకేంటి | transfer Collector banning orders | Sakshi
Sakshi News home page

అయితే మాకేంటి

Published Tue, Dec 3 2013 4:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

transfer Collector banning orders

 మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి:పాఠశాలలకు వెళ్లకుండా డిప్యుటేషన్ల పేరుతో మరోశాఖకు వెళ్లిన ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను రద్దు చేసి స్కూళ్లకు వెళ్లాలని కలెక్టర్ గిరిజాశంకర్ జారీచేసిన ఆదేశాలను సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు సంపాదనగా ఉన్న హాస్టల్ వార్డెన్లుగా వెళ్లారు. వారందరిని తిరిగి వెనక్కి పంపాలని ఆదేశాలున్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఏమీచేయలేకపోతున్నారు. అక్షరాస్యత పరంగా రాష్ట్రంలోనే మనజిల్లా అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అక్షరాస్యతను పెంపునకు ప్రత్యేకచర్యలు తీసుకుంటామని రాజకీయ నాయకులు వేదికలపై ఊదరగొడుతుంటారు. కానీ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయకుండా తప్పించుకుని తిరిగే వారికి మాత్రం ఆ నేతలు 
 అండగా నిలుస్తున్నారు. డిప్యుటేషన్లను రద్దు చేసి అలాంటి వారిని వెంటనే రిలీవ్‌చేయాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా కొందరు అధికారులు వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా పాఠశాలల్లో పనిచేయాలని ఆదేశాలున్నప్పటికీ వాటిని పెడచెవిన పెడుతున్నారు. 
 
 నేతల అండదండలు ఉంటేచాలు!
 ఖిల్లాఘనపూర్ మండలం ఉప్పరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు 2102 డిసెంబర్ 5న నేషనల్ చైల్డ్‌లేబర్ ప్రాజెక్ట్ (ఎన్సీఎల్పీ) కార్యాలయంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఇటీవల ప్రభుత్వ నిర్ణయం మేరకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు పాఠశాలల్లో విధిగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా బి.శ్రీనివాసులు డిప్యుటేషన్‌ను రద్దుచేస్తూ వెంటనే ఎన్సీఎల్పీ కార్యాలయం నుంచి రిలీవ్ చేయాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీచేశారు. వాటిని పట్టించుకోని శ్రీనివాసులు ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఉత్తర్వుల మేరకు ఎన్సీఎల్పీ కార్యాలయానికి అవుట్‌సోర్సింగ్ పద్ధతిన ఇద్దరు ఫీల్డ్ ఆఫీసర్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అకౌంటెంట్, అటెండర్, జీపు డ్రైవర్‌ను నియమించుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇద్దరు అవుట్‌సోర్సింగ్ పద్ధతిన ఫీల్డ్ ఆఫీసర్లను నియమించుకున్నప్పటికీ డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న శ్రీనివాసులును మాత్రం అధికారులు రిలీవ్ చేయలేదు. 
 
   జిల్లాలో మరికొందరు ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్లుగా పనిచేస్తున్నారు. కొంతమంది రాజకీయంగా ఒత్తి డి తీసుకరావడంతో ప్రస్తుతం వార్డెన్లుగానే కొనసాగుతున్నారు. జిల్లా అధికారులు నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో మిగిలిన వారు కూడా రాజకీయనేతల చుట్టూ తిరుగుతూ డిప్యూటేషన్‌పై ఉన్న పోస్టుల్లోనే కొనసాగేందుకు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు అధికార పార్టీకి  చెందిన ఓ ప్రజాప్రతినిధి ద్వారా ఒత్తిడి తీసుకురావడంతో సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ వార్డెన్‌గా డిప్యూటేషన్‌పై పంపించాల్సి వచ్చింది. 
 
 పీడీ ఏమన్నారంటే..
 శ్రీనివాసులు డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ వెంటనే రిలీవ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేసినా ఎందుకు పట్టించుకోలేదని ఇన్‌చార్జి పీడీ సోమశేఖర్‌ను వివరణ కొరగా.. ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న వారికి డిపార్ట్‌మెంట్‌పై అవగాహ న లేకపోవడంతోనే అతని రిలీవ్ చేయలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఔ ట్‌సోర్సింగ్ ద్వారా నియమితులైన వారు ఏం పనిచేస్తారు. బాగా పనిచేసే వాళ్లను విలేకర్లు పని చేయనివ్వరంటూ అసహ నం వ్యక్తం చేశారు. అయితే ఆయన్ను రి లీవ్ చేయాలని కలెక్టర్ రెండు నెలల కిం దట ఆదేశాలిచ్చిన మాట వాస్తవమేనని వెంటనే రీలీవ్ చేస్తానని వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement