ఆలుబాక (వెంకటాపురం), న్యూస్‌లైన్: ఆలుబాక పంచాయతీలోని బొదాపురం రిజర్వ్ ఫారెస్టులో కొండాపురం, బొదాపురం గిరిజనులు ఏడాది కిందట పోడు నరికి వేసుకు న్న 15 ఇళ్లను అటవీ అధికారులు మంగళవా రం పోలీసు బందోబస్తుతో కూల్చివేశారు. అధికారులను అడ్డుకునేందుకు గిరిజనులు తీవ్రంగా ప్రయత్నించారు. గిరిజనులకు, అధికారులకు మధ్య నాలుగు గంటలపాటు వాగ్వాదం జరిగింది. ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ గిరిజనులు గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో, వాజేడు మం డల పర్యటనకు వెళుతున్న భద్రాచలం సబ్ కలెక్టర్ వాహనాన్ని ఆ గిరిజనులు అడ్దగించి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘రిజర్వు ఫారెస్టులో మీరు ఇల్లు కట్టుకున్నారు. ఈ విషయంలో నేనేమీ చేయలేను. అటవీ అధికారులు వారి డ్యూటీ చేశారు’ అని చెప్పి వెళ్లిపోయారు.
కనికరించలేదు..
‘వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్నాం. బాలింతలు, గర్భవతులను తీసుకుని వర్షంలో ఎక్కడికీ వెళ్లలేము. ఒక్క ఇల్లయినా ఉంచాలని వేడుకున్నా అధికారులు కనికరించలేదు’ అని, బాధిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏడాది కిందట పోడు నరికి ఇళ్లు కట్టుకున్నామని వారు చెప్పారు. తమపై అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టారని, జైలు శిక్ష కూడా అనుభవించామని చెప్పారు. ఇంతకాలంపాటు ఇటువైపు కూడా రాని అధికారులు.. వర్షాలు, వరదలతో సతమతమవుతున్న తరుణంలో.. మందీమార్చలంతో ఒక్కసారిగా వచ్చి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
గిరిజనుల ఇళ్లు కూల్చివేత
Published Wed, Aug 7 2013 3:57 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement