టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, దళిత సామాజి క వర్గానికి చెందిన డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, దళిత సామాజి క వర్గానికి చెందిన డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయ న పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది. ఈ విషయం గులాబీ వర్గాలను కలవరపరుస్తోంది. చేర్యాల ప్రాం తానికి చెందిన పరమేశ్వర్ మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో చురుకైన నేతగా ఉన్నారు. కేసీఆర్‌ను నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నట్లు పలుసార్లు ప్రకటించారు. 2009 సాధారణ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్య ర్థి సిరిసిల్ల రాజయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ పొత్తును కాదని టీడీపీ అభ్యర్థిగా దొమ్మాటి సాంబయ్యను రంగంలోకి దింపడంతో పరమేశ్వర్ ఓటమి చవిచూశారు.
తదుపరి వచ్చే ఎన్నికలపై గంపెడాశతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించా రు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ దఫా తప్పకుండా అవకాశం దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయి తే ఇటీవల టీడీపీ నుంచి కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లో చేరడంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ బహిరంగ సభలో ఏకంగా కడియం శ్రీహరిని వరంగల్ పార్లమెంట్ నియోజ కవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో పరమేశ్వర్ ఆశలు గల్లంతయ్యా యి. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా రు. పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనే ఆవేదన.. పార్టీ నాయకులెవరూ తనను పట్టించుకోకపోవడంతో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విసయాన్ని గురువారం ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే అతను ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీ వర్గాలతో మాట్లాడినట్లు సమాచారం. అందులో చేరే అవకాశం ఉందని వినికిడి.