
టీటీడీ ఈవో బాధ్యతల స్వీకారం
మాజీ ఈవోకు ఆత్మీయ వీడ్కోలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులైన సాంబశివరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన మొదట తిరుమలలో స్వామిని దర్శించుకున్నారు. అక్కడ టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. ఈవో ఎంజీ. గోపాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.
అనంతరం బదిలీపై వెళుతున్న తాజా మాజీ ఈవో ఎంజీ.గోపాల్‌కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. వీరిద్దరినీ అన్ని విభాగాల సంఘాలు, అనుబంధ దేవాలయాల ఉద్యోగులు, వేదపండితులు నిలువెత్తు పూలమాలతో ఘనంగా సన్మానించారు. - సాక్షి, తిరుమల/తిరుపతి సిటీ