
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై ఆలయ సీనియర్ అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు మండిపడ్డారు.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై ఆలయ సీనియర్ అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు మండిపడ్డారు. శ్రీవారి ఆలయంలో హోదా విషయంలో తాము రమణ దీక్షితులుకు సమానమేనని స్పష్టం చేశారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా మనవడితో కలిసి నివేదన సమయంలో ఆలయ ప్రవేశం చేసినప్పుడు అధికారుల ఆదేశాలు మేరకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చానన్నారు.
రమణదీక్షితుల కుమారుల బదిలీ వ్యవహారంలో తమ ప్రమేయం లేదన్నారు. శ్రీ వారి ఆలయంలో నిరంతరం పూజా కైంకర్యాలు నిర్వహించేది తామేనని చెప్పారు. తమను కించపర్చేలా నిరంతరం వ్యాఖ్యలు చేస్తూ రమణ దీక్షితులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రధాన అర్చకులు విధులు కేటాయించే సమయంలో ఎలాంటి వివాదాలు ఉండవని నరసింహాచార్యులు అన్నారు.