హైదరాబాద్ నుంచి నైజీరియాకు మాదకద్రవ్యాలు (డ్రగ్స్) అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 20 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి విమానంలో దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన మహిళ అనుమానాస్పద రీతిలో తిరుగుతుండటంతో ఆమెను భద్రత సిబ్బంది ప్రశ్నించారు.
ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పుతుండటంతో భద్రత సిబ్బంది కస్టమ్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో కస్టమ్స్ అధికారులు ఆమె లగేజీలను తనిఖీలు నిర్వహించారు. బ్యాగ్లోని టీ షర్ట్స్ మధ్య ఉంచిన 20 కేజీల మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని,సీజ్ చేశారు. అనంతరం సదరు మహిళను కస్టమ్స్ అధికారులు డీఆర్ఐ అధికారులను అప్పగించారు. డీఆర్ఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే తనది నైజీరియా దేశమని ఆ మహిళ అధికారుల వద్ద వెల్లడించినట్లు సమాచారం.