టీడీపీ నేత పడాల కన్నా కేసులో కీలక మలుపు
విజయవాడ : కృష్ణాజిల్లా అర్బన్ టీడీపీ కార్యదర్శి పడాల కన్నా కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నా భార్య కళ్యాణి తమిళనాడులోని కన్యాకుమారిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పడాల కన్నా మరణానంతరం కుమారుడు, స్నేహితుడితో కలిసి కళ్యాణి అదృశ్యమైంది. గత నెలాఖరులో పడాల కన్నా అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె మంగళవారం లేఖ పంపినట్లు సమాచారం. కళ్యాణి లేఖ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందం తమిళనాడుకు బయల్దేరింది. మరోవైపు కన్యాకుమారిలోని లాడ్జిలో ఓ మహిళ సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో అక్కడ లభ్యమైన ప్రాథమిక ఆధారాలతో ఆత్మహత్యకు పాల్పడింది కళ్యాణిగా స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వాళ్లు ...విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు.