తడ: రాష్ట్రానికి సరిహద్దు గ్రామమైన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వ్యాన్, లారీ ఢీకొన్నాయి. శబరిమల నుంచి అయ్యప్ప భక్తులతో తిరిగి వస్తున్న వ్యాన్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన రాజారావు (30), రాహుల్ (8) అనే భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరి కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని తమిళనాడులోని పొన్నెరీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment