ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఎట్టిపరిస్థితుల్లో విభజించవద్దని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వారిద్దరు కేజీహెచ్ భవనం పైకెక్కారు. సమైక్యంగా ఉంచేంతవరకు తాము కిందకు దిగమని వారు స్పష్టం చేశారు.
దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్నారు. కేజీహెచ్ ఆసుపత్రిపైకి ఎక్కిన వైద్యులను పోలీసులు బుజ్జగించి కిందకి దింపారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.